Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వినయ్రాజ్ దుందిగల్, పండ్రాల లక్ష్మి, రంగ బాషా, నిహారిక చౌదరి, లెంకల అశోక్ రెడ్డి నటీనటులుగా రూపొందిన చిత్రం 'శ్రీ రంగనాయక'. గోవింద రాజ్ విష్ణు ఫిలిం బ్యానర్ పై వెంకట్ రెడ్డి నంది దర్శకత్వంలో రామావత్ మంగమ్మ నిర్మించారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ను నటుడు తనికెళ్ళ భరణి విడుదల చేశారు. దర్శక,నిర్మాతలు ప్రసన్నకుమార్, దామోదర్ ప్రసాద్, ఏలూరు సురేంద్ర రెడ్డి ఈ చిత్ర పోస్టర్ను రిలీజ్ చేశారు.
ప్రస్తుతం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఆదివారం ఫిలిం ఛాంబర్లో సినీ అతిరథుల సమక్షంలో ఈ చిత్ర పోస్టర్, టీజర్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
ఈ సందర్భంగా నటుడు తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, 'నాకు భక్తి సినిమాలు అంటే ఎంతో ఇష్టం. అలాంటిది విష్ణుమూర్తి పైన వస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ను విడుదల చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం దర్శక,నిర్మాతలకు మంచి పేరు తీసుకురావాలి. అలాగే ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని ఆశిస్తున్నాను' అని తెలిపారు.
'ఇప్పటి వరకు ఇండిస్టీలో విష్ణుమూర్తి మీద చేసిన భక్తిరస చిత్రాలు అన్ని హిట్ అయ్యాయి. ఆ సినిమాల మాదిరే ఈ సినిమా కూడా గొప్ప విజయం సాదించాలి. దుందిగల్ వినరు రాజ్ విష్ణుమూర్తి అవతారంలో పరిచయం అవ్వడం చాలా సంతోషంగా ఉంది' అని దర్శకుడు సముద్ర అన్నారు.
నటుడు, చిత్ర నిర్మాత వినరు రాజ్ దుందిగల్, రామావత్ మంగమ్మ మాట్లాడుతూ, 'భగవంతుని అనుగ్రహం నాపై ఉంది. అందుకే నా మొదటి సినిమాతోనే నేను విష్ణు మూర్తి పాత్రతో ఇండిస్టీలోకి ఎంటర్ అవుతున్నాను. ఇది నా పూర్వ జన్మ సుకతంగా భావిస్తున్నాను. సినిమా చాలా బాగా వచ్చింది. మా అక్క, బావలు నవ్వాడ విజయేంద్ర, శోభ విజయేంద్ర సహకారంతో నేను ఈ సినిమా నిర్మించాను. ఈ సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి, ఘన విజయం అందించాలని కోరుతున్నాను' అని తెలిపారు.
'వినరు రాజ్ గారి ఫేస్ సీనియర్ ఎన్టీఆర్ ఆహార్యంలా అనిపించడంతో ఆయన్ని విష్ణుమూర్తి పాత్రకి ఎంపిక చేసుకున్నాం. ఆయన చాలా అద్భుతంగా నటించారు. ఇప్పటి వరకు విలన్ పాత్రలతో మెప్పించిన నటుడు రంగ బాషాను ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం చేశాం. ఇందులోని పాటలు అద్భుతంగా వచ్చాయి. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం మంచచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని దర్శకుడు నంది వెంకట్ రెడ్డి అన్నారు.
చిత్ర సంగీత దర్శకుడు డ్రమ్స్ రాము మాట్లాడుతూ,'ఇందులోని పాటలు బాగా వచ్చాయి. వచ్చే నెలలో విడుదల అవుతున్న మా చిత్రాన్ని అందరూ ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను' అని చెప్పారు.
ఈ చిత్రానికి స్టోరీ రైటర్ :బీనర్లా రామకష్ణ రెడ్డి, కెమెరామెన్ : డి.యాదగిరి, మ్యూజిక్ డైరెక్టర్ : డ్రమ్స్ రాము, డైలాగ్స్ : ముత్యాల గణేష్, ఎడిటింగ్ : ప్రవీణ్ కుమార్, ఆర్ విజరు కుమార్.