Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీహాన్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై అభిరామ్.ఎం దర్శకత్వంలో ప్రియాంక శర్మ కీలక పాత్రలో నటిస్తున్న చిత్రం 'డై హార్డ్ ఫ్యాన్'. ఓ సెలబ్రిటీ, అభిమాని మధ్య జరిగే సస్పెన్స్ కామెడీ డ్రామా ఈ సినిమా కథ. ఫ్యాన్ పాత్రలో శివ ఆలపాటి నటిస్తున్నారు. ఇందులో షకలక శంకర్, రాజీవ్ కనకాల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. బేబమ్మగా షకలక శంకర్, కష్ణ కాంత్ పాత్రలో రాజీవ్ కనకాల ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇటీవల రిలీజ్ చేసిన ఈ ఇద్దరి ఫస్ట్ లుక్‌లకు అనూహ్యమైన స్పందన లభించింది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమా పూర్తిగా కామెడీ సస్పెన్స్ డ్రామాగా రాబోతుంది. మధు పొన్నాస్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సయ్యద్ తేజుద్దీన్ మాటలు రాస్తున్నారు. కథ, కథనం, ఇందులోని పాత్రలన్ని ప్రేక్షకుల్ని కచ్చితంగా థ్రిల్ చేస్తాయి. బేబమ్మగా షకలక శంకర్ నవ్విస్తాడు. అలాగే రాజీవ్ కనకాల మరోసారి తన నటనలోని భిన్న కోణాన్ని కృష్ణకాంత్ పాత్రలో ఆవిష్కరించబోతున్నారు. ఈ సినిమాతో ఆయనకు మరింత మంచి పేరు లభిస్తుందనే నమ్మకం ఉంది. ఆద్యంతం వైవిధ్యభరితంగా రూపొందిన ఈచిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు' అని తెలిపింది.
ఈ చిత్రానికి నిర్మాత: చంద్రప్రియ సుబుధి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సందీప్ కింతలి, మాటలు: సయ్యద్ తేజుద్దీన్, సంగీతం: మధు పొన్నాస్.