Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ నిర్మల మనవడు, సీనియర్ నరేష్ అల్లుడు శరణ్ కుమార్ హీరోగా 'మిస్టర్ కింగ్' చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని హన్విక క్రియేషన్స్ పతాకంపై బి.ఎన్.రావు నిర్మిస్తున్నారు. శశిధర్ చావలి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. విజయ నిర్మల జయంతి సందర్భంగా ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆదివారం కష్ణ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ, 'విజయ నిర్మల జయంతి సందర్భంగా ఈ చిత్ర పోస్టర్‌ను ఆవిష్కరించడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ద్వారా హీరోగా శరణ్ మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా. సినిమా సూపర్ హిట్ కావాలి. దర్శక నిర్మాతలకు, చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు' అని చెప్పారు.
'నాగేశ్వరరావు, రవికిరణ్‌లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హీరో శరణ్ నా అల్లుడు. నా కజిన్ రాజ్ కుమార్ కొడుకు. మా ఫ్యామిలీ నుంచి వస్తున్న 8వ హీరో. మంచి టీమ్‌తో ముందుకు వస్తున్నారు. ఎట్రాక్టివ్ టైటిల్‌తో అలరించేట్లుగా ఉంది. ఈ సినిమాలో సహనటులు సీనియర్స్ మురళీశర్మ, సునీల్ తదితరులు నటిస్తున్నారు. చక్కటి నిర్మాణ విలువలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. శరణ్ మంచి హీరో అవ్వాలని కోరుకుంటున్నాను' అని సీనియర్ నరేష్ అన్నారు. నిర్మాత బి.ఎన్.రావు మాట్లాడుతూ, 'మంచి క్యారెక్టర్ ఉంటే రాజుతో సమానం. అందుకే కథాపరంగా మా చిత్రానికి 'మిస్టర్ కింగ్' అని టైటిల్ పెట్టాం. మా అమ్మగారు కూడా విజయనిర్మలగారి అభిమాని. మా సినిమా పోస్టర్ ఆవిష్కరించిన కష్ణ, నరేష్ గారికి ధన్యవాదాలు' అని తెలిపారు. 'చక్కటి కుటుంబ కథతో మంచి ఎంటర్టైన్మెంట్లో సాగే సినిమా ఇది' అని దర్శకుడు శశిధర్ చావలి అన్నారు.
హీరో శరణ్ మాట్లాడుతూ, 'తాతగారు కష్ణ, నరేష్ అంకుల్, నాని ఆశీర్వాదాలతో నేను హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. నరేష్ అంకుల్ నాకు రోల్ మోడల్. తాతగారి సినిమాలు, నరేష్ అంకుల్ సినిమాలు చూస్తూ పెరిగాను. ఈ సినిమా యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఇందులో నా పాత్ర పేరు శివ. యూత్‌కు బాగా కనెక్ట్ అవుతుందని నమ్ముతున్నా. మణిశర్మగారు చక్కటి బాణీలు సమకూర్చారు' అని తెలిపారు.
శరణ్ కుమార్, నిష్కల, ఊర్వీ సింగ్, మురళీ శర్మ, తనికెళ్ల భరణి, సునీల్, వెన్నెల కిషోర్, శ్వేత ప్రగటూర్, ఐడ్రీమ్ అంజలి, శ్రీనివాస్ గౌడ్, మిర్చి కిరణ్, జబర్దస్త్ ఫణి, రోషన్ రెడ్డి, రాజ్‌కుమార్ సమర్థి, శ్రీనిధి గూడూరు తదితరులు నటిస్తున్నారు.