Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం 'యశోద'. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి - హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం కళా దర్శకుడు అశోక్ నేతత్వంలో రూ. 3 కోట్ల రూపాయల వ్యయంతో సెట్స్ వేశారు. ప్రస్తుతం ఈ సెట్స్‌లో కథలోని కీలకమైన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కష్ణప్రసాద్ మాట్లాడుతూ, 'సమంత ప్రధాన తారగా మేం నిర్మిస్తున్న ఈ సినిమాలో 30 నుంచి 40 శాతం సన్నివేశాలు ఓ ప్రాంతంలో జరుగుతాయి. అందుకోసం హైదరాబాద్‌లో చాలా స్టార్ హౌటల్స్ చూశాం. అయితే 35 నుంచ 40 రోజులు హౌటల్స్‌లో చిత్రీకరణ చేయడం అంత సులభం కాదు. అందుకని, సీనియర్ కళా దర్శకుడు అశోక్ నేతత్వంలో సెట్స్ రూపొందించాం. నానక్‌రామ్ గూడాలోని రామానాయుడు స్టూడియోలో రెండు ఫ్లోర్స్ తీసుకుని వేసిన ఈ సెట్స్ కోసం సుమారు మూడు కోట్ల రూపాయలు ఖర్చు అయ్యింది. సెవెన్ స్టార్ హౌటల్లో ఉండే సౌకర్యాలను తలపించేలా ఏడెనిమిది సెట్స్ వేశాం. ఈనెల 3న మొదలైన ఈ షెడ్యూల్ అక్కడే జరుగుతోంది. సమంత, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ తదితర ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నాం. పతాక సన్నివేశాలు కొడైకెనాల్లో ప్లాన్ చేశాం. ఏప్రిల్ నెలాఖరుకు చిత్రీకరణ అంతా పూర్తి చేయాలనుకుంటున్నాం. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం' అని చెప్పారు.
''ఒక్కడు'లో ఛార్మినార్ సెట్ వేసినది అశోకే. ఆయన ఇంకా పలు సినిమాల్లో ఎన్నో అద్భుతమైన సెట్స్ వేశారు. తెలుగు, తమిళ భాషల్లో సుమారు 150కు పైగా సినిమాలు చేశారు. కథకు తగ్గట్టు ఈ సినిమా కోసం ఆయన అద్భుతమైన సెట్స్ వేశారు. అశోక్ పనితనానికి, కళానైపుణ్యానికి 'యశోద' సెట్స్ తార్కాణంగా నిలుస్తాయి. ప్రేక్షకులు ఊహించని కథతో, 'యశోద' అనే డిఫరెంట్ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రంలో సమంత పోషించే పాత్ర అందర్నీ థ్రిల్ చేస్తుంది. దర్శకులు ఇద్దరూ ఎంతో అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. భిన్న కథాంశంతో రూపొందుతున్న ఈచిత్రానికి మాటలు, పాటలు ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తాయి' అని చిత్రబందం తెలియజేసింది.
ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి, కెమెరా: ఎం. సుకుమార్, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకష్ణారెడ్డి, దర్శకత్వం: హరి - హరీష్.