Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం 'భీమ్లా నాయక్'. దర్శకుడు, రచయిత త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే- సంభాషణలు అందిస్తున్నారు.
సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ అత్యంత ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్‌తో నిర్మించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'పవర్‌స్టార్ అభిమానులతోపాటు ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, క్యారెక్టర్ లుక్స్, పాటలు
అందర్నీ విశేషంగా అలరించి, సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. అయితే ఆ అంచనాలకు దీటుగా ఈ సినిమా ఉండబోతుందని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్, రానాల స్క్రీన్ షేరింగ్ అందర్నీ ఫిదా చేస్తుంది. తమన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ సినిమాని మరోస్థాయిలో ఉంచింది. ఈనెల 21న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను వైభవంగా నిర్వహించటానికి మేకర్స్ సంకల్పించారు. హైదరాబాద్, యూసుఫ్ గూడలోని పోలీస్ గ్రౌండ్స్‌లో జరగబోయే ఈ వేడుకకు తెలంగాణ రాష్ట్ర మంత్రి కె.టి.ఆర్ ముఖ్య అతిథిగా, రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రత్యేక ఆహ్వానితులుగా విచ్చేస్తున్నారు. వేలాది మంది ప్రేక్షకాభిమానుల సమక్షంలో జరిగే ఈ వేడుకలో చిత్ర బందం అంతా పాల్గొననుంది' అని తెలిపింది.