Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, పాండిరాజ్ కాంబినేషన్లో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ 'ఈటి'. డిఫరెంట్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మార్చి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. లేటెస్ట్గా ఈ చిత్ర తెలుగు టీజర్‌ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశారు.
'ఒక నిమిషం ఏడు సెకండ్ల నిడివిగల ఈ టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో మాస్ ప్రేక్షకులను ఊర్రూతలూగించింది. హీరోయిన్, విలన్‌ను ఒక్కో ఫ్రేమ్‌లో చూపించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో సూర్య మాస్ అవతార్‌ను ఎలివేట్ చేశారు. మొత్తంగా టీజర్‌తో సినిమాపై మేకర్స్ అంచనాలు పెంచేశారు. డి ఇమాన్ సంగీతం, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్‌గా నిలుస్తాయి. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మించిన ఈ సినిమాలో సూర్యకి జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ నటించగా, వినరురారు ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రంలో సత్యరాజ్, రాజ్ కిరణ్, శరణ్య కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్ర తెలుగు హక్కులను ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. తమిళ వెర్షన్‌తో పాటు తెలుగులోనూ ఈ చిత్రాన్ని మార్చి 10న ఒకేసారి విడుదల చేయబోతున్నారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.