Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పేట', 'చదురంగవేట్టై' వంటి చిత్రాల్లో విలన్‌గా నటించిన రామచంద్రన్ ప్రధాన పాత్రలో, శివకుమార్ హీరోగా పరిచయం అవుతూ రూపొందిన చిత్రం 'డేక్ డైవర్షన్'. పాటినీకుమార్, గాయత్రి నాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి శివానీ సెంథిల్ దర్శకత్వం వహిస్తున్నారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకను ప్రసాద్ లాబ్స్‌లో మేకర్స్ ఘనంగా నిర్వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న నిర్మాత లగడపాటి శ్రీధర్ ట్రైలర్‌ని విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతల్లో ఒకరైన చందు మద్దాల మాట్లాడుతూ,'తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా చేస్తున్నాం. ఇదొక భిన్న ప్రేమకథా చిత్రం. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్‌గా అలరిస్తుంది. దర్శకుడు సెంథిల్ అద్భుతంగా తెరకెక్కించారు. అన్ని రకాల కమర్షియల్ హంగులతో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకం ఉంది' అని తెలిపారు. 'మా మద్దాల ప్రొడక్షన్స్ బ్యానర్‌ని మొదలెట్టి మంచి సినిమాలు చేయాలన్న సంకల్పంతో ముగ్గురు అన్నదమ్ములం కలిసి ఈ బ్యానర్‌ని స్థాపించాం. మంచి కథ, కథనాలతో తెరకెక్కిన ఈ సినిమా పూర్తయింది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం. ఇందులో జాన్ విజరు గారి పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆద్యంతం ఆసక్తికరంగా రూపొందిన ఈచిత్రం మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం' అని నిర్మాతలు నిర్మాత వెంకట్ మద్దాల, రామ్ మద్దాల చెప్పారు.