Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు శర్వానంద్ నటించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. రష్మిక మందన్న హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో రాధిక, ఊర్వశి, కుష్బు కీలక పాత్రలను పోషించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ని నిర్మించారు.
ఈ చిత్రాన్ని మార్చి 4న రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు ఈ సందర్భంగా సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ, 'నేను చాలా భాషల్లో సినిమాలు చేశాను. అందులో ఎన్నో డిఫరెంట్ రోల్స్ ఉన్నాయి. డైరెక్టర్ కిశోర్ ఈ కథ నెరేట్ చేస్తున్నప్పుడే చాలా భిన్నంగా అనిపించింది. ఎందుకంటే ఒక హీరో క్యారెక్టర్‌ను సెంట్రిక్‌గా పెట్టుకుని, ఆయన చుట్టూ ఉన్న ఆడవాళ్ల పాత్రలకు మంచి ఇంపార్టెన్స్ ఇస్తూ ఈ కథ రాసుకోవడం విశేషం. ఆ పాయింట్ నాకు చాలా యూనిక్‌గా, ఇదొక ఫీల్‌గుడ్ మూవీ అవుతుందనిపించింది. షూటింగ్ పూర్తయ్యాక స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు కూడా అదే ఫీలింగ్ కలిగింది. ఈ సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో కనిపిస్తాను. నా పాత్ర గురించి ఒక్కమాటలో చెప్పాలంటే క్రికెట్ టీమ్‌లో ధోనిలా అన్నమాట (నవ్వుతూ). చాలా కామ్‌గా ఉంటాను. కాని ఎప్పటికప్పుడు కథను ముందుకు నడిపిస్తుంటా. ఇంట్రడక్షన్‌తోనే నా పాత్ర ఎలా ఉండబోతుంది అనేది ఆడియన్స్‌కి తెలుస్తుంది. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో శర్వాకి ఐదుగురు తల్లులు ఉంటారు. ఒక్కో తల్లి ఒక్కో మెంటాలిటీతో ఉంటుంది. వారందరినీ పెళ్లికి ఎలా ఒప్పించాడు అనేది స్క్రీన్ మీద చూడాల్సిందే. ఊర్శశి, కుష్బుతో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది. శర్వానంద్, రష్మిక మందన్న ఇద్దరూ వెరీ వెరీ డెడికేటెడ్. వారిద్దరికీ మంచి భవిష్యత్ ఉంది. శర్వా పాత్ర, తన నటన ప్రేక్షుకులను బాగా ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ కిశోర్ తిరుమల చాలా డీసెంట్. నిర్మాత సుధాకర్ చెరుకూరికి మంచి టేస్ట్ ఉంది. ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా చూసే సినిమా ఇది. అన్ని సమస్యలను మర్చిపోయి నవ్వుకునేలా చేస్తుందీ చిత్రం' అని తెలిపారు.