Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పిజిపి ప్రొడక్షన్స్ (పానుగంటి ప్రొడక్షన్స్) బ్యానర్‌పై వాసం నరేష్, ఆశ ప్రమీల హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్న చిత్రం 'ప్యాకప్'. జీవీఎస్ ప్రణీల్ దర్శకత్వంలో పానుగంటి శరత్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం సోమవారం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం ముఖ్య అతిథిగా హాజరై, హీరోహీరోయిన్లపై చిత్రీకరించిన తొలి షాట్‌కు క్లాప్ కొట్టి, ఈ చిత్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,'మంచి కంటెంట్ ఉన్న కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రం మంచి విజయం సాధించి, యూనిట్‌కు మంచి పేరు తీసుకురావాలి' అని చెప్పారు.
'అనేక మలుపులు తీసుకుని ఈ సినిమా ఇప్పుడు భారీగా రూపొందేందుకు రెడీ అయింది. మంచి టీమ్‌తో, మంచి కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది' అని హీరో వాసం నరేష్ అన్నారు. హీరోయిన్ ఆశ ప్రమీల మాట్లాడుతూ, 'వృత్తిరీత్యా నేను డాక్టర్ని. ఈ చిత్రంతో యాక్టర్‌గా మారుతున్నాను. అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు' అని తెలిపారు. 'మంచి కథ. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అన్ని అంశాలు ఈ చిత్రంలో ఉంటాయి. ప్రేమలో ఉండే ఒక వైవిధ్యకోణాన్ని ఈ చిత్రంతో చెప్పబోతున్నాం' అని డైరెక్టర్ జివిఎస్ ప్రణీల్ అన్నారు. నిర్మాత పానుగంటి శరత్ రెడ్డి మాట్లాడుతూ, 'ఏకధాటిగా ఈ సినిమా షూటింగ్ చేస్తాం. మా బ్యానర్‌కి మంచి విజయాన్ని అందించే సినిమా ఇది అని కచ్చితంగా చెప్పగలం' అని అన్నారు.