Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ట్రెండ్‌కి అనుగుణంగా అత్యంత వేగంగా సినిమాలను తీయటంలో దర్శకుడు పూరి జగన్నాథ్ స్టయిలే వేరు. ఇంట్రెస్టింగ్ కథలతో, సరికొత్త స్క్రీన్‌ప్లేతో సినిమాలు తీసి ప్రేక్షకుల్ని మెప్పించడంలో దిట్ట.
'ఇస్మార్ట్ శంకర్' సినిమాతో నిర్మాతగా, దర్శకుడిగా బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పూరి 'లైగర్' చిత్రీకరణను పూర్తిచేశారు. విజయ్ దేవరకొండతో పాన్ ఇండియా చిత్రంగా 'లైగర్'ని తెరకెక్కించారు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆగస్ట్ 25న ప్రపంచ వ్యాప్తంగా అత్యంత భారీ స్థాయిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అలాగే తన డ్రీమ్ ప్రాజెక్ట్ 'జనగణమన'ని సొంత బ్యానర్ పూరి కనెక్ట్స్‌లో చేయబోతున్నారు. ఈ సినిమాని కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నారు. దీని తర్వాత ఓ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌ని సెట్స్‌పైకి తీసుకెళ్ళేందుకు పూరి రంగం సిద్ధం చేశారు. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ వివరాలను సస్పెన్స్‌లో పెట్టినప్పటికీ దీన్ని కూడా పూరి తన సొంత బ్యానర్లో ఛార్మి కౌర్‌తో కలిసి నిర్మించనున్నారు. 'జనగణమన'తోపాటు ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన కథ కూడా పూరి రెడీ చేశారని ఆయన ప్రతినిధి బృందం తెలిపింది.