Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి బాలకష్ణ, గోపీచంద్ మలినేని ఫస్ట్ కాంబినేషన్లో పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఈ నేపథ్యంలో సోమవారం ఈచిత్రంలోని బాలయ్య లుక్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ లుక్‌లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారుతో రగ్డ్ లుక్‌లో మెడలో రుద్రాక్ష మాలతో బాలకష్ణ స్టైలిష్‌గా వాక్ చేస్తున్నారు. క్యారెక్టర్ఎలివేషన్కి సంబంధించి ప్రతి హంగూ ఈ పోస్టర్లో కనిపించడం విశేషం. ట్రెండీ లుక్‌తో ఉన్న బాలకష్ణ ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోందని మేకర్స్ తెలిపారు.
'పక్కా మాస్ కమర్షియల్ అంశాలతో ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ప్రస్తుతం సిరిసిల్లలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ పోస్టర్ ఫైట్ సీక్వెన్స్‌ను రామ్ - లక్ష్మణ్ మాస్టర్స్ రూపొందిస్తున్నారు. ఫస్ట్‌లుక్ అదుర్స్ అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపించారు. ఇక బాలయ్య బాబు ఫ్యాన్స్ ఆనందానికి ఆకాశమే హద్దయ్యింది. ఇందులో బాలకష్ణ సరసన శతి హాసన్ హీరోయిన్గా నటిస్తుండగా, ప్రతి నాయకుడి పాత్ర ద్వారా కన్నడ నటుడు దునియా విజరు తెలుగు పరిశ్రమకు పరిచయమవుతున్నారు. బాలకష్ణ 107వ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ కీలక పాత్ర కోసం వరలక్ష్మీని ఎంపిక చేశారు. నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ సంయుక్తంగా అత్యంత భారీగా నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి సంగీతం: తమన్ ఎస్, డీఓపీ: రిషి పంజాబీ, ఎడిటర్: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా, ఫైట్స్ : రామ్- లక్ష్మణ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చందు రావిపాటి, లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రహ్మణ్యం కేవీవీ, స్టోరీ-స్క్రీన్ ప్లే- డైరెక్టర్: గోపీచంద్ మలినేని.