Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర నాయిక సమంత ప్రధాన పాత్రలో గుణ శేఖర్ రూపొందిస్తున్న పాన్ ఇండియా సినిమా 'శాకుంతలం'. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. చిత్రీకరణను పూర్తి చేసుకున్న ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సోమవారం ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్లో ఇప్పటి వరకు రానటువంటి అందమైన, అద్భుతమైన, చూడచక్కటి దశ్య కావ్యంగా 'శాకుంతలం' సినిమాను డైరెక్టర్ గుణ శేఖర్ ఆవిష్కరిస్తున్నారు. ఓ డైరెక్టర్‌గా, మేకర్‌గా తెలుగు సినిమాని కొత్త పుంతలు తొక్కించిన వారిలో గుణ శేఖర్ ఒకరు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వైవిధ్యాన్ని చూపించడం ఆయన అలవాటు. ఈ చిత్రాన్ని కూడా ఇది వరకు తెలుగు ప్రేక్షకులు చూడని సరికొత్త ప్రేమ కావ్యంగా ఆయన మలుస్తున్నారు. అందుకు తార్కాణమే తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్. ముని కన్యగా ఆశ్రమంలో కూర్చుని ఉన్న సమంత, ఆమె చుట్టూ ఉన్న ఆహ్లాదరకమైన అందమైన అడవి ప్రాంతం, సాధు జంతువులతో ఫస్ట్‌లుక్ పోస్టర్ చూడముచ్చటగా అందర్నీ అలరిస్తోంది. పొయెటిక్ లుక్‌గా మనసుకు హత్తుకునేలా ఉంది. మేకింగ్‌లో కాంప్రమైజ్ కాకుండా సినిమాను రూపొందించే గుణ టీమ్ వర్క్స్ 'రుద్రమదేవి' వంటి హిస్టారికల్ వండర్ తర్వాత, దాన్ని మించేలా మరో అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది' అని చిత్ర బృందం తెలిపింది.
నిర్మాత దిల్ రాజు సమర్పణలో డిఆర్పి - గుణ టీమ్ వర్క్స్ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రాన్ని నీలిమా గుణ నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీత సారథ్యం వహిస్తుండగా, శేఖర్ వి.జోసెఫ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు : సాయి మాధవ్ బుర్రా, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనింగ్: అశోక్, కాస్ట్యూమ్స్ డిజైనింగ్ : నీతా లుల్లా.