Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రేడియంట్ రీల్స్ నిర్మాణంలో శ్రీ సినిమా సమర్పణలో శ్రీచంద్ జీ తెరకెక్కిస్తున్న చిత్రం 'తెర'. ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికష్ణ చేతుల మీదుగా రవీంద్రభారతిలో (హైదరాబాద్) మొదలైంది. దర్శకుడు వి.ఎన్. ఆదిత్య తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా, ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్. గోపాల్ రెడ్డి కెమెరా స్విచాన్ చేశారు. ఈ సందర్భంగా హీరో కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ, 'రంగస్థలం నేపథ్యంలో మరాఠీలో వచ్చిన 'నట సామ్రాట్' మాదిరిగానే ఇప్పుడు తెలుగులో పూర్తిగా రంగ స్థల నటులతో వస్తున్న సినిమా ఇది. సురభి టెక్నిక్స్ కూడా వాడుకుని ఈ సినిమా చేయబోతున్నాం. రంగస్థలం పాత్రనే సినిమాలో కూడా నటిస్తుండటం ఆనందంగా ఉంది' అని చెప్పారు.
తెలంగాణ ప్రభుత్వ కల్చరల్ డైరెక్టర్ మామిడి హరికష్ణ మాట్లాడుతూ, 'దర్శకుడు శ్రీచంద్ సమాజంలో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. కథ విన్నాను. ఎంతో బాగుంది. గుమ్మడి గోపాలకష్ణ వంటి గొప్పవాళ్లు ఈ సినిమాలో నటించడం విశేషం' అని అన్నారు.
'మంచి కథతో తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చూపిస్తున్నాం. మూడు షెడ్యూల్స్‌లో సినిమాని పూర్తి చేస్తాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి దసరాకు విడుదల చేస్తాం' అని నిర్మాత వేణు మనోహర్ రెడ్డి తెలిపారు.