Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చిత్ర సీమలో దర్శకుడిగా, నిర్మాతగా తేజ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా రెండు కొత్త ప్రాజెక్టుల వివరాలను సదరు చిత్ర బృందాలు అధికారికంగా ప్రకటించాయి.
వీటిల్లో తేజ డ్రీమ్ ప్రాజెక్ట్ 'విక్రమాదిత్య'ని భవ్య సమర్పణలో లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి) నిర్మించనున్నారు. సోమవారం ఈ సినిమా షూటింగ్ ఆరంభమైంది. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌లో రైలింజన్ స్టీమ్‌లో హీరో, హీరొయిన్లు రొమాంటిక్‌గా ఉండటంతోపాటు ఓ క్లాసిక్ ప్రేమకథను తెరపై తొలిసారిగా చూడబోతున్నామనే సెన్స్‌ని క్రియేట్ చేసింది. అలాగే ఈ కథ 1836 సంవత్సరంలోనిది అని పోస్టర్ ద్వారా తెలిపారు. ఇదే సమయంలో సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీని నిర్మించారు. ఈ కథ ఆ కాలం నాటిదని, ఆ వంతెనకు ఈ ప్రేమ కథకు మధ్య సంబంధం ఉందని పోస్టర్చెప్పకనే చెబుతోంది.
దగ్గుబాటి అభిరామ్‌తో అహింస
తేజ, దగ్గుబాటి అభిరామ్ కాంబినేషన్లో ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ నిర్మిస్తున్న చిత్రం 'అహింస'. ఈ చిత్రం నుండి అభిరామ్ దగ్గుబాటి ప్రీ-లుక్‌ని తేజ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో రక్తం కారుతున్న అభిరామ్ ముఖం జూట్ బ్యాగ్‌తో కప్పబడి ఉంది. ప్రీ లుక్ పోస్టర్ అదిరిపోయేలా ఉండడంతో సినిమాపై క్యూరియాసిటీ నెలకొంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్గా దీన్ని నిర్మాత పి.కిరణ్ నిర్మిస్తున్నారు.