Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ కార్తీక్, హేబా పటేల్ జంటగా నటిస్తున్న చిత్రం 'తెలిసిన వాళ్ళు'. సిరింజ్ సినిమా బ్యానర్‌పై ఈ చిత్రాన్ని విప్లవ్ కోనేటి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్ విడుదలైంది. దీనికి అనూహ్య స్పందన లభించడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా దర్శక, నిర్మాత విప్లవ్ కోనేటి మాట్లాడుతూ,'మా చిత్ర గ్లింప్స్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అందరిలోనూ మంచి ఆసక్తి క్రియేట్ అయ్యింది. అలాగే టైటిల్ కూడా క్యాచీగా ఉండటంతో సోషల్ మీడియాలోనూ ట్రెండింగ్ అవుతోంది. గ్లింప్స్‌లో రామ్ కార్తీక్, హేబా పటేల్ నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. శ్రీ చరణ్ పాకాల సంగీతం, అనంత్ నాగ్, అజరు నాగ్ల సినిమాటోగ్రఫీ, ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్‌తోపాటు ఈ సినిమాలోని విఎఫ్ఎక్స్ వర్క్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. భిన్న కథతో రూపొందుతున్న మా చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం' అని తెలిపారు. సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, జయ ప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: విప్లవ్ కోనేటి.