Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బుల్లితెర ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేసేందుకు జీ తెలుగు ఛానెల్ ఎప్పటికప్పుడు సరికొత్త పంథాని అనుసరిస్తోంది. ఇందులో భాగంగా ఫ్రెష్ కంటెంట్‌తో ఉండే సీరియల్స్, ఇంటిల్లిపాదిని ఆకట్టుకునే షోలు, వెండితెర ప్రేక్షకులు అమితంగా మెచ్చిన సినిమాలు.. ఇలా యూత్ దగ్గర్నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ విశేషంగా అలరిస్తోంది.
లేటెస్ట్గా రాబోయే ఆదివారం (ఈనెల 27న) రెండు సర్ప్రైజ్లతో జీ తెలుగు ముందుకు రానుంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా 'వరుడు కావలెను' ప్రసారం చేస్తుండగా, 'వలీమై' చిత్ర నిర్మాత బోనీ కపూర్, సంగీత దర్శకుడు యువన్ శంకర్ రాజా, హీరో కార్తికేయ రాత్రి 9 గంటలకు 'స రి గ మ ప - ది సింగింగ్ సూపర్ స్టార్' లో ప్రత్యేక అతిథులుగా పాల్గొంటున్నారు. అన్నింట్లో పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకొనే భూమి (రీతూవర్మ) అమ్మాయిని ప్రేమించిన ఆకాశ్ (నాగశౌర్య) అనే అబ్బాయి కథే 'వరుడు కావలెను'. వెండితెర ప్రేక్షకుల్ని మెప్పించిన ఈ సినిమా బుల్లితెర ప్రేక్షకుల్ని కూడా కచ్చితంగా అలరిస్తుందనే దీమాని జీ తెలుగు ప్రతినిధి బృందం వ్యక్తం చేసింది.