Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు శర్వానంద్ నటించిన అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. రష్మిక మందన్న హీరోయిన్. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై తిరుమల కిషోర్ దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌ను నిర్మిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రం విడుదల కానుంది. 'ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఆయన మ్యూజిక్ ఇప్పటికే సినిమాపై మరింత బజ్ పెంచింది. విడుదలైన మూడు పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన 4వ పాట 'మాంగళ్యం తంతునానేనా..' పాటను మంగళవారం చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ పాట థీమ్, కంపోజ్ చేసిన విధానం, పాడిన తీరు.. ఫన్నీ లిరిక్స్ అన్ని కలిపి ఈ పాటను మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో నిలబెట్టాయి.
'మాంగళ్యం తంతునానేనా' అనే శ్లోకాన్ని ఆధునీకరించిన ఈ పాటలో శర్వానంద్ తన చిరాకు చూపించాడు. దేవి శ్రీ ప్రసాద్ స్వయంగా రాసిన ఈ పాటకు జస్ప్రీత్ జాస్ గాత్రం అందించారు. శర్వా డ్యాన్స్ మూమెంట్స్ ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ యాక్టర్స్ కలిసి నటిస్తుండడం ఈ సినిమాలో మరో విశేషం' అని చిత్ర బృందం తెలిపింది.
వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు ఈ చిత్రంలోని ప్రధాన తారాగణం.