Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శతాధిక చిత్రాల దర్శకుడు కోడి రామకష్ణ తనయ కోడి దివ్య దీప్తి నిర్మాతగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. తమ సొంత నిర్మాణ సంస్థ కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై కార్తిక్ శంకర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ప్రొడక్షన్ నెం1గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' అనే టైటిల్‌ని ఖరారు చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత కోడి దివ్య దీప్తి మట్లాడుతూ, 'కథ డిమాండ్ మేరకు 'నేను మీకు బాగా కావాల్సిన వాడిని' టైటిల్‌ని ఫైనల్ చేశాం. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న మా చిత్రానికి మణిశర్మగారు అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఆడియోని లహరి మ్యూజిక్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. మా నాన్నగారి చిత్రాలన్నింటినీ ఫ్యామిలీ అంతా ఓ పిక్నిక్గా థియేటర్‌కి వెళ్ళి చూసేవారు. ఇప్పటికీ టీవిలో ఆయన సినిమాలొస్తుంటే ఫ్యామిలీ అంతా కూర్చుని చూస్తుంటారు. అలా తెలుగు ప్రేక్షకులకి ఆయన బాగా కావాల్సినవాడిగా, వారి కుటుంబ సభ్యుడిగా ఆయన మారిపోయారు. ఆయన తనయగా నేను నిర్మించే సినిమాలు కూడా ఆ కోవలోనే ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని నిర్మించాను. సకుటుంబ సపరివార సమేతంగా చూడదగ్గ చిత్రమిది. టైటిల్‌తోపాటు లవర్‌బారు లుక్‌లో కలర్ఫుల్గా ఉన్న మా హీరో ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన లభించడం ఆనందంగా ఉంది' అని తెలిపారు.
కిరణ్ అబ్బవరం, సంజన ఆనంద్, ఎస్వి కష్ణారెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: ప్రవీన్ పూడి. ఆర్ట్ డైరక్టర్.. ఉపేంద్ర రెడ్డి ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ .. భరత్ రొంగలి పిఆర్ ఓ.. ఏలూరు శ్రీను, మెఘశ్యామ్ సినిమాటోగ్రఫి.. రాజ్ నల్లి సంగీతం.. మణిశర్మకో-ప్రోడ్యూసర్.. నరేష్ రెడ్ది మూలె ప్రోడ్యూసర్.. కోడి దివ్య దీప్తి డైరక్టర్.. కార్తిక్ శంకర్