Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సురేష్ ప్రొడక్షన్స్ అధినేత డి. సురేష్ బాబు, గురు ఫిల్మ్స్ సునీత తాటి కాంబినేషన్లో లేటెస్ట్గా నిర్మితమైన 'శాకిని ఢాకిని' విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతోపాటు శ్రీ సింహ కోడూరితో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిలింస్ మూడవ చిత్రాన్ని నిర్మించనుంది. ఈ థ్రిల్లర్ చిత్రానికి నూతన దర్శకుడు సతీష్ త్రిపుర దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. 'దొంగలున్నారు జాగ్రత్త' అనేది టైటిల్. ఫస్ట్ లుక్
పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉండటం విశేషం. అంతేకాదు ఈ డిఫరెంట్ ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రాజెక్ట్ పై క్యూరియాసిటీని పెంచేలా ఉంది. ఇందులో ప్రీతి అస్రాని హీరోయిన్గా నటిస్తుండగా, సముద్రఖని కీలక పాత్రని పోషిస్తున్నారు. షూటింగ్ తుది దశలో ఉన్న ఈ చిత్రానికి ప్రతిభగల సాంకేతిక బందం కూడా పని చేస్తోంది. 'మత్తువదలరా' ఫేమ్ కాల భైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తుండగా, యశ్వంత్ సి సినిమాటోగ్రాఫర్, గ్యారీ బిహెచ్ ఎడిటర్‌గా వ్యవహరిస్తున్నారు. 'ప్రస్తుతం ప్రేక్షకులు భిన్న కథల్ని బాగా ఆదరిస్తున్నారు. అలాంటి భిన్న కథతో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీసింహ కోడూరి తనదైన శైలిలో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేయబోతున్నాడు. అలాగే ఊహించని ట్విస్ట్‌లతో ఈ సినిమా అందర్నీ థ్రిల్ చేస్తుంది' అని నిర్మాతలు అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: రోహిత్ కులకర్ణి, ఆర్ట్: గాంధీ నడికుడికర్.