Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : అద్భుత విజయం అందుకున్న తర్వాత అపహరణ్ 2 – సబ్కా కటేగా దొబారా ఇప్పుడు మరోసారి డబుల్ థ్రెట్, డబుల్ ఎడ్జ్, డబుల్ రిస్క్‌తో వూట్ సెలక్ట్లో మళ్లీ వస్తోంది. ఏక్తా ఆర్ కపూర్, జియో స్టూడియోస్ సౌజన్యంతో రూపొందిన అపహరణ్ 2 వినోదంతో పాటు రెట్టింపు డ్రామా, థ్రిల్లర్, క్రైమ్, యాక్షన్‌తో కీలక సందేశం సబ్కా కటేగా దొబారాను కచ్చితంగా అందిస్తుంది. ఈ అద్భుతమైన సిరీస్‌లో అరుణోదయ్ సింగ్, నిధి సింగ్, స్నేహిల్ దీక్షిత్ మెహ్రా (అలియాస్ బీసీ ఆంటీ సీజన్ 1 ఫేమ్), సానంద్ వర్మతో పాటు మహానటుడు జితేంద్ర కపూర్ కూడా ఉన్నారు. వీరు కాకుండా సుఖమణి సదానా, ఉజ్జ్వల్ చోప్రా, ఆదిత్య లాల్ కూడా ఈ సిరీస్‌లో నటించారు. నిజాన్ని వెలికితీసేందుకు దుష్ట శక్తులను ఎదుర్కొంటూ అనేక సవాళ్లతో పోరాటం చేస్తున్న సాహసోపేత పోలీసు రుద్రతో (అరుణోదయ్ సింగ్) అపహరణ్ సీజన్ 1 ముగిసింది. ఈ సీజన్లో కథ సిద్ధార్త్ సేన్‌గుప్తా, ఉమేశ్ పడాల్కార్, అనహాత మేనేన్తో మొదలవుతుంది. సంతోష్ సింగ్ దర్శకత్వంలో ఇండియా, సెర్బియా మధ్య జరిగే మరో కట్టిపడేసే కిడ్నాప్ కథనంతో భారతదేశపు అత్యంత ప్రసిద్ధిగాంచిన పోలీసు అధికారి మళ్లీ వస్తాడు. క్యాచీ రెట్రో మ్యూజిక్, మసాలా దట్టించిన వినోదం, ఊహించని మలువులు, సస్పెన్స్, ప్రతీ సంఘటనలో చోటుచేసుకునే థ్రిల్కతో కూడిన ఈ ఆకట్టుకునే క్రైమ్ డ్రామా నిజంగా ఈ జానర్‌కు వన్నె తెస్తుంది.
అపహరాన్ సీజన్ 2 గురించి ఏక్తా ఆర్ కపూర్ మాట్లాడుతూ, “ఈ షో కచ్చితంగా ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతుంది. వారు కోరుకుంటున్న డ్రామా ఇది. ఇందులో ప్రతీది రెట్టింపుగా ఉంటుంది - ముప్పు, డ్రామా, యాక్షన్, మిస్టరీ, అభిరుచే కాదు ప్రతీకారం కూడా. ప్రతి పాత్ర లక్షణాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. ప్రతి స్క్రిప్ట్ భిన్నంగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. అపహరణ్ 2 ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగలదని నేను నమ్ముతున్నాను – సబ్కా జరూర్ కటేగా దొబారా. తీవ్ర స్వభావం ఉన్న పాత్ర గురించి అరుణోదయ్ సింగ్ మాట్లాడుతూ, “ అపహరణ్ సీజన్ 1 ప్రేక్షకులను చక్కగా స్వీకరించారు, ప్రశంసించారు. రుద్ర శ్రీవాస్తవ పాత్ర పోషణలో అనేక సవాళ్లు, డిమాండ్లు ఉన్నాయి. అలాంటి సంక్లిష్టమైన పాత్రను పోషించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏక్తా కపూర్‌తో చేసిన రెండో సిరీస్ ఇది (మై తేరా హీరో లెక్కించడం లేదు), సెకండ్ సీజన్‌ను మరింత ఎత్తుకు తీసుకెళ్లేందుకు టీమ్ అంతా బాగా కష్టపడింది. ఇదంతా అభిమానుల చలవే. నిజం చెప్పాలంటే ఇది ఒక చక్కని ఒత్తిడి, దాని వలన మన నుంచి ది బెస్ట్ బయటకు వస్తుంది” అన్నారు.