Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తిగున్, పూజిత పొన్నాడ జంటగా యమ్.పి ఆర్ట్స్ బ్యానర్‌పై చాణిక్య చిన్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'కథ కంచికి మనం ఇంటికి'. మోనిష్ పత్తిపాటి నిర్మాత. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దీనికి అనూహ్యమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో దర్శక, నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదలైన మా చిత్ర ఫస్ట్ లుక్కు మంచి రెస్పాన్స్ వచ్చింది. హార్రర్ ప్లస్ కామెడీ కాంబినేషన్లో ఉన్న ట్రైలర్ కూడా ఆద్యంతం వినోదభరితంగా అందర్నీ అలరించింది. తిగున్, పూజిత మధ్య ప్రేమతో మొదలైన ఈ ట్రైలర్.. హర్రర్ జోనర్లోకి టర్న్ తీసుకుంటుంది. ఆ తర్వాత చివరి వరకు ఆహ్లాదకరంగానే సాగింది. అలాగే సప్తగిరి కామెడీ ట్రాక్ బాగా నవ్విస్తోంది. సినిమా కూడా అంతే ఆసక్తికరంగా ఉంటూ నవ్విస్తుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తయ్యింది. మార్చి 18న ప్రపంచ వ్యాప్తంగా మా చిత్రాన్ని థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని తెలిపారు.
మహేష్ మంజ్రేకర్, సప్తగిరి, వినోద్ కుమార్, శ్యామల, హేమంత్ , గెటప్ శ్రీను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సుభాష్ దేవాబత్తిన, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : దత్తి సురేశ్ బాబు, లైన్ ప్రొడ్యూసర్ : కుమార్ కోట, మ్యూజిక్ : బీమ్స్ సిసిరోలియో, డి.ఓ.పి : వైయస్ కష్ణ, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, డైలాగ్స్ : శ్రీనివాస్ తేజ, ఫైట్స్ : షావోలిన్ మల్లేష్.