Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్‌కళ్యాణ్, రానా దగ్గుబాటి కాంబినేషన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన చిత్రం 'భీమ్లానాయక్'. నిత్యామీనన్, సంయుక్తమీనన్ కథానాయికలు. దర్శకుడు త్రివిక్రమ్ సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించారు. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తమన్ స్వరకర్త. నేడు (శుక్రవారం) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక బుధవారం హైదరాబాద్ యూసఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్లో అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్, దానం నాగేందర్, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, 'ఈరోజు ఇక్కడికి ప్రభుత్వ ప్రతినిధిగా రాలేదు. పవన్ కల్యాణ్‌గారి సోదరుడిగా వచ్చా. 'భీమ్లా నాయక్' చిత్రం ద్వారా చాలా మంది అజ్ఞాత సూర్యులను బయటికి తీసుకు వచ్చినందుకు పవన్ కల్యాణ్, చిత్రయూనిట్‌కి అభినందనలు' అని అన్నారు.
'అహంకారానికి, ఆత్మగౌరవానికి ఒక మడమ తిప్పని యుద్థం' ఈ చిత్రం. తెలుగువారికి చేరువయ్యేలా తీర్చిదిద్దిన త్రివిక్రమ్‌గారికి థ్యాంక్స్' అని పవన్‌కళ్యాణ్ చెప్పారు. రానా మాట్లాడుతూ, 'ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే, ఇప్పుడు రాబోయే చిత్రాలన్నీ పవన్‌కల్యాణ్ ప్రభావంతో కొత్తగా ఉంటాయి' అని తెలిపారు. 'పవన్‌కల్యాణ్‌గారంటే నాకు తెలిసింది ఒకటే! గెలుపంటే మోజు లేదు.. ఓటమి అంటే భయం లేదు' అని దర్శకుడు సాగర్ కె.చంద్ర తెలిపారు.