Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి ధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, ధీరజ్ ఆత్రేయ నవకాంత్, ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'షికారు'. నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్.కుమార్ (బాబ్జీ) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి హరి కొలగాని దర్శకుడు. గురువారం ఈ చిత్ర ట్రైలర్ను అగ్ర దర్శకుడు వి.వి.వినాయక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'నేను 'ఆది' సినిమా చేసినప్పుడు రెండు సీన్లు చూసి ఎక్కువ రేటుకు కొన్నారు బాబ్జీ. ఆయనకు నా సినిమాపై నమ్మకం అలాంటిది. జడ్జిమెంట్ బాగా తెలుసు. వైజాగ్ పంపిణీదారుడుగా మంచి పేరు ఉంది. దర్శకుడు హరి నిర్మాతను ఒప్పించి, ఈ సినిమా చేయటం చాలా గొప్ప విషయం. ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చెప్పారు.
'హరి గారు కథను చాలా అందంగా, కామెడీగా తీర్చిదిద్దారు. సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర చక్కటి బాణీలు సమకూర్చారు' అని నిర్మాత పి.ఎస్. ఆర్. కుమార్ (బాబ్జీ) అన్నారు. దర్శకుడు హరి మాట్లాడుతూ, 'వినాయక్ గారు వచ్చి ఆశీర్వదించడం చాలా ఆనందంగా ఉంది. మంచి యూత్ ఫుల్ సినిమా. ఇలాంటి కథలు ప్రస్తుతం రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేక్షకుడికి పుల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చే సినిమా ఇది' అని చెప్పారు.