Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విజయ్ శంకర్, అషు రెడ్డి, సుహాసిని మణిరత్నం, భానుచందర్ ప్రధాన పాత్రధారులుగా నటించిన చిత్రం 'ఫోకస్'. జి. సూర్యతేజ దర్శకత్వం వహిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది.
తాజాగా ఈ సినిమాలోని సుహాసిని మణిరత్నం స్పెషల్ లుక్ పోస్టర్ను అగ్ర రచయిత విజయేంద్రప్రసాద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'దర్శకుడు సూర్యతేజ తన డెబ్యూ మూవీగా రిలాక్స్ మూవీ మేకర్స్ పతాకంపై ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. టీజర్ చూశాను. చాలా బాగుంది. ఇందులోని పాత్రలన్ని చాలా బాగున్నాయి. అందరూ ఈ సినిమాని చూసి ఎంకరేజ్ చేయండి' అని తెలిపారు.
'నేను దర్శకత్వం వహించిన తొలి చిత్రమిది. ఈ సినిమాలోని సుహాసిని గారి లుక్ను ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు కథలను అందించిన విజయేంద్రప్రసాద్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది. భాను చందర్, షియాజీ షిండే, జీవా, సూర్య భగవాన్ ఇలా.. చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు ఈ సినిమాలో నటించారు. ఇదొక భిన్న సస్పెన్స్ థ్రిల్లర్. షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతోంది. మార్చిలో సినిమాని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం' అని దర్శకుడు జి.సూర్యతేజ అన్నారు. స్కైరా క్రియేషన్స్ సమర్పణలో వస్తున్న ఈ చిత్రానికి ఎడిటర్: సత్య. జి, డీఓపీ: జె. ప్రభాకర్ రెడ్డి, సంగీతం: వినోద్ యజమాన్య, లిరిసిస్ట్: కాసర్ల శ్యామ్.