Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ కంటేశ్వర్
జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ చిత్రా మిశ్రను శుక్రవారం కలిసి బిసి ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో మార్చి 6వ తేదీన నిర్వహించే సావిత్రి బాయి పూలే అవార్డ్ కార్యక్రమం అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్యక్రమంకు రావల్సిందిగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బిసి ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్, ఉపాధ్యక్షులు శ్యామ్, మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, గౌరవ సలహాదారులు రమణ స్వామి, డిచ్ పల్లి మండలం బిసిటియు అధ్యక్షులు కంజర్ల గంగాధర్, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.