Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రభాస్, పూజ హెగ్డే జంటగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'రాధే శ్యామ్'. గోపికష్ణ మూవీస్ ప్రైవేట్ లిమిటెడ్, యూవీ క్రియేషన్ సంయుక్తంగా ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. యువి కష్ణంరాజు ఈ సినిమాను సమర్పిస్తుండగా, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్నారు. రాధా కష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.
మార్చి 11న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి 'ఈ రాతలే...' అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ విడుదలైంది. ఈ లిరికల్ సాంగ్‌కి మంచి స్పందన రావడం పట్ల మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
'లేటెస్ట్గా రిలీజ్ చేసిన ఈ ఫుల్ వీడియో సాంగ్‌కి కూడా అత్యద్భుతమైన రెస్పాన్స్ లభిస్తోంది. ఈ కలర్ ఫుల్ వీడియో సాంగ్‌కు అనూహ్య స్పందన రావడంతో సినిమాపై భారీ అంచనాలను పెంచింది. పాటను అద్భుతమైన లొకేషన్లలో దర్శకుడు రాధాకష్ణ కుమార్ చిత్రీకరించారు. ఈ పాటలో ఉన్న కొన్ని ఆసక్తికరమైన విషయాలు అందర్నీ విశేషంగా అలరిస్తున్నాయి. పంచ భూతాలైన నిప్పు, ఆకాశం, నీరు, భూమి, గాలి.. వీటిని ఈ లిరికల్ వీడియోలో చూపించారు. ప్రేమించే వాళ్ళ కోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా అన్నింటినీ అధిగమించి వాళ్లను చేరుకోవడమనేది ఈ పాట ఉద్దేశ్యమని నాయకా,నాయికలను చూస్తే అర్థమవుతుంది. ప్రేమికులుగా ప్రభాస్, పూజా హెగ్డే జంట అందర్నీ బాగా అలరిస్తుంది. వీరిద్దరి మధ్య సాగే సన్నివేశాలు, సంభాషణలు ఆద్యంతం థ్రిల్ చేస్తాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించే భిన్న ప్రేమకథా చిత్రంగా దీన్ని మేకర్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు' అని చిత్ర బృందం పేర్కొంది.
కష్ణంరాజు, భాగ్యశ్రీ, సచిన్ ఖేడ్కర్, ప్రియదర్శి తదితరులు నటించిన ఈ చిత్రానికి నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రసీధ, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ (తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం), మిథున్, అనూ మాలిక్, మనన్ భరద్వాజ్ (హిందీ), సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, యాక్షన్ కొరియోగ్రఫీ: నిక్ పావెల్, కొరియోగ్రఫీ: వైభవి మర్చంట్, ప్రొడక్షన్ డిజైనర్: రవీందర్, సౌండ్ ఇంజనీర్: రసూల్ పూకుట్టి, కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: కె.కె.రాధాకష్ణ కుమార్.