Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు శర్వానంద్ నటిస్తున్న నయా ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. రష్మిక మందన్న నాయిక. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ను నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 4న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్ర గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని ఈనెల 27(ఆదివారం) సాయంత్రం హైదరాబాద్‌లోని శిల్ప కళా వేధికలో వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అగ్ర దర్శకుడు సుకుమార్, కథానాయికలు కీర్తి సురేష్, సాయిపల్లవి హాజరుకానున్నారు.
'దేవి శ్రీ ప్రసాద్ సంగీత సారథ్యంలో ఇప్పటికే విడుదల చేసిన అన్ని పాటలకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఇందులో శర్వానంద్ పోషించిన పాత్ర చాలా వైవిధ్యంగా ఉంటూ అందరినీ అలరించనుంది. శర్వా, రష్మిక జంట కెమిస్ట్రీ ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేస్తుంది. ఇందులో కుష్బూ, రాధిక శరత్ కుమార్, ఊర్వశీ వంటి సీనియర్ యాక్టర్స్ కలిసి నటిస్తుండడం మరో విశేషం. మహిళల గొప్పతనాన్ని తెలిపే సినిమా ఇది. కథ, కథనం, సన్నివేశాలు, పాటలు.. సంభాషణలు, ఫొటోగ్రఫీ.. ఇలా ప్రతీదీ హైలెట్‌గా రూపొందిన ఈ చిత్రాన్ని మార్చి 4న భారీ ఎత్తున రిలీజ్‌కి మేకర్స్ రంగం సిద్ధం చేశారు' అని చిత్ర యూనిట్ తెలిపింది.
వెన్నెల కిషోర్, రవి శంకర్, సత్య, ప్రదీప్ రావత్, గోప రాజు, బెనర్జీ, కళ్యాణీ నటరాజన్, రాజశ్రీ నాయర్, ఝాన్సీ, రజిత, సత్య కష్ణ, ఆర్సీఎం రాజు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సుజిత్ సారంగ్, ఎడిటర్: శ్రీకర్ ప్రసాద్, ఆర్ట్ డైరెక్టర్: ఎ.ఎస్.ప్రకాష్, కొరియోగ్రఫర్: దినేష్, దర్శకత్వం: తిరుమల కిషోర్, నిర్మాత : సుధాకర్ చెరుకూరి.