Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో కిరణ్ అబ్బవరం హీరోగా రూపొందిన చిత్రం 'సెబాస్టియన్ పిసి524'. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లు. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సిద్ధారెడ్డి.బి, జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి క్లీన్ యుబైఎ సర్టిఫికెట్ లభించింది. ప్రపంచ వ్యాప్తంగా మార్చి 4న ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'రేచీకటి నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. రేచీకటి ఉన్న హీరోకి పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది. అతడు నైట్ టైమ్ డ్యూటీ ఎలా చేశాడు?, రేచీకటి వల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? అనేది సినిమా కథాంశం. జిబ్రాన్ సంగీతం దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలోని పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియోకు ప్రేక్షకుల నుండి ఊహించలేనటువంటి ట్రెమండస్ రెస్పాన్స్ లభించింది. మా హీరో కిరణ్కు ఈ సినిమా కూడా ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్ ఇస్తుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాం. మార్చి 4 న రాబోతున్న మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించి, ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాం' అని తెలిపారు.