Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎస్.కె.పిక్చర్స్, ఆకతి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న తాజా చిత్రం 'దళారి'. షకలక శంకర్, రాజీవ్ కనకాల, శ్రీ తేజ్ ప్రధాన పాత్రధారులుగా తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఎమోషనల్ యాక్షన్ డ్రామా హైలెట్‌గా రూపొందిన ఈ సినిమా టాకీ పార్ట్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. లేటెస్ట్గా ఈ చిత్ర టైటిల్‌ను దర్శక, నిర్మాతలు ఎనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ, 'మా సినిమాను వేగవంతంగా పూర్తి చేశాం. దీనికి సహకరించిన నిర్మాతలకు ధన్యవాదాలు. ప్రేక్షకులకు ఒక మంచి సినిమా అందించాలనే ప్రయత్నంతో ఈ సినిమా చేశాం' అని తెలిపారు.'దర్శకుడు గోపాల్ రెడ్డి అద్భుతంగా సినిమా తెరకెక్కించారు. ఇందులో మంచి పాత్ర పోషించినందుకు చాలా ఆనందంగా ఉంది' అని షకలక శంకర్ అన్నారు. శ్రీతేజ్ మాట్లాడుతూ, 'ఇదొక సోషల్ కాజ్‌తో ఉన్న అమేజింగ్ థ్రిల్లర్' అని చెప్పారు. ''శంభో శంకర' బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి షకలక శంకర్‌తో ఈ సినిమా చేశాం. ఇప్పటివరకు రాని పాయింట్‌తో ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రాబోతుంది' అని నిర్మాత సురేష్ కొండేటి అన్నారు. మరో నిర్మాత ఎడవెల్లి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ, 'కంటెంట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమా చేశాం. సినిమాను కచ్చితంగా ప్రేక్షకులు ఆదరిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను' అని తెలిపారు.