Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'గాలి నాగేశ్వరరావు'గా మంచు విష్ణు ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో స్వాతి పాత్రలో పాయల్ రాజ్‌ఫుత్, రేణుకగా సన్నీలియోన్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ ఇద్దరూ సినిమాలో భాగమైన విషయాన్ని చిత్ర బృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది.
'గాలి నాగేశ్వరరావు' క్యారెక్టర్ని కార్టూన్ రూపంలో విడుదల చేసినట్టే, పాయల్, సన్నీలియోన్ క్యారెక్టర్లని కూడా అలాగే రిలీజ్ చేసి అందరిలో ఆసక్తి క్రియేట్ చేయటం విశేషం.
డా. మంచు మోహన్ బాబు ఆశీస్సులతో అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్‌ప్లేతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్‌గా కోన వెంకట్ వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి మూల కథ : జి.నాగేశ్వర్‌రెడ్డి సినిమాటోగ్రాఫర్: చో టా.కె.నాయుడు, డైలాగ్స్ : భాను, నందు, సంగీతం : అనూప్ రూబెన్స్.