Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సహజంగా కాలేజీ విద్యార్ధులంటే ఆటపాటలతో అల్లరితో గడిపేస్తుంటారు. అలా కాకుండా సామాజిక స్పహ ఉన్న ఓ విద్యార్థి అందరికి ఎలా ఆదర్శంగా నిలిచింది అనే కథాంశంతో ఎస్ఎంవీ ఫిలిమ్స్ తమ 11వ చిత్రాన్ని నిర్మిస్తోంది. దీనికి జిఎల్బి.శ్రీనివాస్ దర్శక, నిర్మాత.
ఈ చిత్రంలో నాయికగా ట్రాన్సీ అనే కొత్త అమ్మాయి పరిచయం అవుతోంది. మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ దుర్గమ్మ ఆశీస్సులతో పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు దర్శక, నిర్మాత జిఎల్బి.శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్‌తో పాటు కర్నాటక, విజయవాడ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుగుతుంది. మార్చి నెలాఖరు నుండి షూటింగ్ మొదలవుతుందని చిత్ర బందం తెలిపింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ సినిమాలో గుండ వేణి హని, కెఎస్.దేవి, లక్ష్మీ రావు, కోఆర్డినేటర్ ఫణీంద్ర ప్రసాద్ శర్మ, నవ్య శ్రీ, మౌనిక రెడ్డి, తేరాల రంజిత్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి మాటలు: పోలూర్ ఘటికాచలం, ఛాయాగ్రహణం: సురేంద్రరెడ్డి, పాటలు: పెరుమాళ్ల నాగేంద్రప్రసాద్, కో ప్రొడ్యూసర్: చంద్ర, సంగీతం: శ్రీపాల్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: వరంగల్ వాసు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి.భిక్షపతి గౌడ్, సమర్పణ: పెరుమాళ్ల నాగ సుబ్బులు.