Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కోవిడ్ కారణంగా మనందరం ఎంతో టెన్షన్ పడ్డాం. ఆ టెన్షన్ నుంచి బయట పడేసి, ప్రేక్షకులకు మంచి రిలీఫ్ ఇచ్చే సినిమా 'స్టాండప్ రాహుల్' అని అంటున్నారు కథానాయిక వర్ష బొల్లమ్మ అన్నారు. హీరో రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ జంటగా నటించిన సినిమా 'స్టాండప్ రాహుల్'.
కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్లపై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. ఈ సినిమా ఈ నెల 18న విడుదల కానుంది.
ఈ సందర్భంగా మంగళవారం వర్ష బొల్లమ్మ మీడియాతో మాట్లాడుతూ, 'ఇందులో నా పాత్ర పేరు శ్రేయ. తనకంటూ కొన్ని డ్రీమ్స్ ఉంటాయి. తన డ్రీమ్తోపాటు పార్టనర్ డ్రీమ్ కూడా ఇందులో మిళతమై ఉంటుంది. మా డ్రీమ్స్ ఎలా నెరవేరాయన్నదే ఈ సినిమా. రాజ్‌తరుణ్ అద్భుతంగా నటించాడు. మా నిర్మాతలు దర్శకుడికి మంచి ఫ్రీడమ్ ఇచ్చి, మంచి అవుట్‌ఫుట్ వచ్చేలా సహకరించారు. నటిగా ఏదైన ఇన్పుట్ ఇస్తే దానికి దర్శకుడు శాంటో మంచి వాల్యూ ఇచ్చేవారు. ఇంతకు ముందు నేనెప్పుడూ కామెడీ సినిమా చేయలేదు. ఇదే తొలిసారి. వెన్నెల కిశోర్ వంటి గొప్ప నటుడితో చేయడం కొంచెం కష్టంగా అనిపించింది. ఎందుకంటే స్క్రిప్ట్‌లోని డైలాగ్‌లు కాకుండా ఒక్కోసారి స్పాంటేనియస్‌గా కొన్ని ఆయన చెప్పేస్తారు. అప్పుడు నేను నవ్వకుండా చెప్పాలి. ఇలాంటివి థ్రిల్‌గా అనిపించాయి. నాకు బాగా నచ్చిన పాత్రలు, సినిమాలే చేస్తున్నా. ప్రస్తుతం 'స్వాతిముత్యం' చిత్రంలో నటిస్తున్నా' అని అన్నారు.