Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు బాబీ (కె.ఎస్.రవీంద్ర) కాంబినేషన్లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ రూపొందుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి 154వ చిత్రంగా నటిస్తున్న దీన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తోంది.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్గా శతిహాసన్ను ఎంపిక చేసినట్టు మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. 'ఈ మహిళా దినోత్సవం నాడు, మీకు స్వాగతం పలకడం ఆనందంగా ఉంది, మీరు మెగా 154కి స్త్రీ శక్తిని తీసుకొచ్చారు' అని చిరంజీవి ట్వీట్ చేశారు.
నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జి.కె.మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బందంతోపాటు ప్రముఖ నటీనటులు భాగమయ్యారు.
ఈ చిత్రానికి సంగీతం : దేవి శ్రీ ప్రసాద్, డిఓపీ : ఆర్థర్ ఎ విల్సన్, ఎడిటర్: నిరంజన్ దేవరమానే, ప్రొడక్షన్ డిజైనర్: ఏఎస్ ప్రకాష్, సహ నిర్మాతలు: జీకె.మోహన్, ప్రవీణ్.ఎం., స్కీన్ ప్లే: కోన వెంకట్, కె.చక్రవర్తి రెడ్డి, అదనపు రచన: హరి మోహన కష్ణ, వినీత్ పొట్లూరి, కాస్ట్యూమ్ డిజైనర్: సుస్మిత కొణిదెల, లైన్ ప్రొడ్యూసర్: బాలసుబ్రహ్మణ్యం కె.వి.వి.