Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రవితేజ తాజాగా నటిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ 'రామారావు ఆన్ డ్యూటీ'. నూతన దర్శకుడు శరత్ మండవ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్ఎల్వి సినిమాస్ ఎల్ఎల్పి, ఆర్టి టీమ్‌వర్క్స్ పతాకాలపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తయ్యింది. లేటెస్ట్గా రెండు పాటల చిత్రీకరణ కోసం చిత్ర బృందం స్పెయిన్‌కి వెళ్ళింది. అక్కడ అద్భుతమైన లొకేషన్లలో ఈ పాటలను చిత్రీకరణను ఇప్పటికే స్టార్ట్ చేశారు. ఈ పాటల చిత్రీకరణతో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.
'ఇటీవల ఈ చిత్రం నుంచి విడుదల చేసిన యాక్షన్ ప్యాక్డ్ టీజర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా అందరీలోనూ ఈ టీజర్ చాలా క్యూరియాసిటీని రైజ్ చేసింది.. త్వరలో ఈ సినిమా మ్యూజిక్ ప్రమోషన్లను మేకర్స్ ప్రారంభించనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు శరత్మండ అత్యద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. రవితేజ కెరీర్లో గుర్తుండిపోయే సినిమా ఇది. ఇందులో ఆయన పాత్ర చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. 'రామారావు ఆన్ డ్యూటీ' అంటూ పవర్ఫుల్ అప్పీల్ ఉన్న మాస్ టైటిల్‌తో ఈ చిత్రంలో రవితేజ నట విశ్వరూపాన్ని మరోమారు ప్రేక్షకులు చూడబోతున్నారు. ఇక ఆయన అభిమానులు మాత్రం ఫుల్ ఖుషీ అవుతారు. ముఖ్యంగా యూనిక్‌గా డిజైన్ చేసిన యాక్షన్ సీక్వెన్స్‌లు అందర్నీ థ్రిల్ చేస్తాయి. కథ, కథనం, నటీనటుల నటన పోటాపోటీగా సాగుతూ ఆద్యంతం ఆసక్తికరంగా సాగుతుంది. దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తుండగా, వేణు తొట్టెంపూడి రీఎంట్రీ ఇస్తూ ఈ సినిమాలో ఒక కీలక పాత్రని పోషించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని విశేషాలను మేకర్స్ ప్రకటించనున్నారు' అని చిత్ర యూనిట్ పేర్కొంది.
నాజర్, సీనియర్ నరేష్, పవిత్ర లోకేష్, 'సర్పట్ట' జాన్ విజరు, చైతన్య కష్ణ, తనికెళ్ల భరణి, రాహుల్ రామకష్ణ, ఈరోజుల్లో శ్రీ, మధు సూదన్ రావు, సురేఖ వాణి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: శరత్ మండవ, నిర్మాత: సుధాకర్ చెరుకూరి, సంగీత దర్శకుడు: సామ్ సిఎస్, డిఓపీ : సత్యన్ సూర్యన్, ఎడిటర్: ప్రవీణ్ కెఎల్, ఆర్ట్ డైరెక్టర్: సాహి సురేష్.