Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హీరో చైతన్య రావు, డైరక్టర్ చందు ముద్ద, నిర్మాత యశ్ రంగినేని కలయికలో ఓ సినిమా రూపొందనుంది. 'పెళ్లి చూపులు', 'డియర్ కామ్రేడ్', 'దొరసాని', 'ఏబీసీడీ' వంటి పలు సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్ జాతీయ అవార్డ్‌ని దక్కించుకుని మంచి అభిరుచి గల నిర్మాణ సంస్థగా గుర్తింపు తెచ్చుకుంది. కొత్త తరహా చిత్రాలతో, కొత్త దర్శకులకు అవకాశమిస్తూ సినిమాపై తనకున్న ప్యాషన్‌ని నిర్మాత యశ్ రంగినేని చాటుకుంటున్నారు.
ప్రస్తుతం శ్రీసింహా కోడూరి హీరోగా 'భాగ్ సాలే' చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌తో కలిసి నిర్మిస్తున్న ఈ సంస్థ లేటెస్ట్గా మరో కొత్త చిత్రాన్ని
నిర్మించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇది బిగ్ బెన్ సినిమాస్‌పై నిర్మితమవుత్ను సోలో ప్రాజెక్ట్ కావడం విశేషం.ఈ చిత్రంలో '30 వెడ్స్ 21' ఫేమ్ చైతన్య రావు మాధాడి హీరోగా, 'ఓ పిట్ట కథ' చిత్ర దర్శకుడు చందు ముద్ద దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో పాటు ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఓ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌తో ఈ సినిమా రూపొందనుంది. త్వరలో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. ఈ సినిమాలో నటించే నటీనటులు, మిగతా సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తామని నిర్మాత యశ్ రంగినేని తెలిపారు.
'బిగ్బెన్లాంటి సంస్థలో ఉత్తమాభిరుచిగల నిర్మాత యశ్ రంగినేనితో ఈ సినిమా చేయటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు చందు ముద్ద ఓ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు' అని హీరో చైతన్యరావు అన్నారు.