Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'వై2కె సమస్య వచ్చినప్పుడు హైదరాబాద్‌లోని ఓ కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా 'నాతిచరామి' చిత్రాన్ని తెరకెక్కించాం. క్రైమ్ నేపథ్యంలో సాగే హై ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా ఇది. అదే ఈ సినిమా ప్రత్యేకత. భార్యాభర్తల మధ్య ఉండే అన్యోన్నతకి అప్యాయతలకు అద్దం పడుతూ 'నాతిచరామి' టైటిల్‌కి ఎలా జస్టిఫికేషన్ చేశామన్నది మాటల్లో కంటే వెండితెర మీద చూస్తేనే థ్రిల్లింగ్‌గా ఉంటుంది' అని దర్శకుడు నాగు గవర అన్నారు.
అరవింద్ కష్ణ, పూనమ్ కౌర్, సందేశ్ బురి ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రం 'నాతి చరామి'. శ్రీ లక్ష్మీ ఎంటర్ప్రైజెస్ సమర్పణలో ఎ స్టూడియో 24 ఫ్రేమ్స్ ప్రొడక్షన్ పతాకంపై జై వైష్ణవి.కె నిర్మించారు. నేడు (గురువారం) ఈ సినిమా రికార్డ్ స్థాయిలో ఏకంగా 20 భిన్న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌లో విడులవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు నాగు గవర మీడియాతో సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే..
ఛాలెంజింగ్ స్క్రిప్ట్..
'వీకెండ్ లవ్', 'కర్త కర్మ క్రియ' సినిమాల తర్వాత నేను చేసిన మూడవ చిత్రమిది. ఈ రెండు చిత్రాలు నా కథలతోనే తెరకెక్కి, మంచి అప్లాజ్ని సొంతం చేసుకున్నాయి. తొలిసారి ఇతరుల కథకి దర్శకత్వం వహించా. మనం రాసుకున్న కథని వెండితెరపై చూపించడం చాలా ఈజీ. కానీ ఇతరుల కథతో సినిమా తీయాలంటే కత్తిమీద సామే. ఎందుకంటే కథలో వాళ్ళు అనుకున్న సోల్‌ని ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఎఫెక్టీవ్‌గా చూపించాలి.ఈ విషయంలో నేను సక్సెస్ అయ్యానని నమ్మకంగా చెప్పగలను. నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమాలోనూ మహిళా ప్రాధాన్యం ఉన్న అంశాలున్నాయి. అలాగే మంచి సందేశం కూడా ఉంది. ఛాలెంజింగ్ స్క్రిప్ట్‌తో సినిమా చేసినందుకు హ్యాపీగా ఉన్నా.
సినిమాపై ఉన్న నమ్మకం, ధైర్యమే కారణం..
పూనమ్‌కౌర్, అరవింద్ కృష్ణ, సందేశ్బురి అత్యద్భుత నటన, మహి సినిమాటోగ్రఫీ, వినోద్ అద్వయ ఎడిటింగ్‌తోపాటు మ్యూజిక్, ఆర్ట్.. ఇలా ప్రతీ అంశం, అలాగే సినిమా తీసిన విధానం, కథలోని స్ట్రాంగ్ కంటెంట్ అన్నింటికంటే ముఖ్యంగా ఇది యూనివర్సల్ అప్పీల్ ఉన్న స్క్రిప్ట్ కావడంతో దీన్ని తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నాం. అమెజాన్, హంగామా, సోనీ,టాటా స్కై, ఎయిర్ టెల్ ఎక్స్ట్రీమ్, యమ్.ఎక్స్, ప్లేయర్ వంటి 20 ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఈ చిత్రాన్ని రికార్డ్ స్థాయిలో మా నిర్మాతలు రిలీజ్ చేస్తున్నారు. సినిమాపై ఉన్న నమ్మకం, మంచి సినిమా తీశామనే ధైర్యంతోనే మా నిర్మాతలు ఒకేసారి ఇన్ని ఫ్లాట్‌ఫామ్స్‌లో విడుదల చేస్తున్నారు. దర్శకుడికి పూర్తి స్వేచ్ఛనివ్వడంతోపాటు మంచి సినిమాని పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులకు చేరువ చేయాలని ఆలోచించే అరుదైన నిర్మాతలు నాకు దొరకటం అదృష్టం.