Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ కథానాయకుడు విశ్వక్ సేన్ నటిస్తున్న నూతన చిత్రం 'దాస్ కా ధమ్కీ'.
ఈ సినిమా బుధవారం రామానాయుడు స్టూడియోలో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆరంభమైంది.
హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ నివేత పేతురాజ్ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్‌కు నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ నివ్వగా 'ఎఫ్3' దర్శకుడు అనిల్ రావిపూడి కెమెరా స్విచ్చాన్తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. స్క్రిప్ట్‌ను రచయిత ప్రసన్నకుమార్ దర్శక, నిర్మాతలకు అందజేశారు. ఇదే నేపథ్యంలో అల్లు అరవింద్ టైటిల్ లోగోను ఆవిష్కరించి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 'సినిమా రంగంలో పోటీ ఉన్నప్పటికీ, ప్రేక్షకులు నన్ను గుర్తించి విజయాలు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ కోసం వెతుకుతూ తిరిగే స్థాయి నుంచి నిర్మాతగా ఎదిగే స్థాయికి వచ్చేలా చేశారు. ఈ సినిమాకి అన్ని వనరులతోపాటు మంచి టీమ్ దొరికింది. మాస్ అప్పీల్ ఉండే సినిమా ఇది. థియేటర్లో చూసిన ప్రేక్షకులు ఊగిపోయేలా ఉండే కథ ఇది. కష్ణదాస్గాడి జీవితంలో జరిగే కథే ఈ సినిమా. ఈనెల 14 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం' అని అన్నారు.
'విశ్వక్ సేన్‌తో ఈ సినిమాలోనూ నటించడం చాలా సంతోషంగా ఉంది. కథ చాలా ఆసక్తి కరంగా ఉంది. అందుకే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించాను' అని నాయిక నివేత పేతురాజ్ తెలిపారు. చిత్ర నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ, ''ఫలక్నామా దాస్' సినిమా తర్వాత సేమ్ టీమ్‌తో చేస్తున్న సినిమా ఇది. మా బ్యానర్లో మంచి వినోదాత్మకమైన సినిమాలను తీయాలని ప్రయత్నిస్తున్నాం' అని అన్నారు. దర్శకుడు నరేశ్ కుప్పిలి మాట్లాడుతూ, ''పాగల్' సినిమా తర్వాత నేను చేస్తున్న సినిమా ఇది. రచయిత ప్రసన్నకుమార్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ఎసెట్. లియో బాణీలు చక్కగా కుదిరాయి' అని తెలిపారు. సంగీత దర్శకుడు లియోన్ జేమ్స్ మాట్లాడుతూ, 'ఈ సినిమాకు మంచి పాటలతోపాటు సంగీతం బాగా సమకూరింది. 'పాగల్' తర్వాత చేస్తున్న విశ్వక్సేన్ చేస్తున్న ఈ సినిమాని కూడా చేయటం ఆనందంగా ఉంది' అని చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాత : కరాటే రాజు, రచయిత : ప్రసన్నకుమార్ బెజవాడ, కెమెరా : దినేష్ కె.బాబు, సంగీతం: లియోన్ జేమ్స్, ఎడిటర్ :అన్వర్ అలీ, ఆర్ట్ : ఎ.రామాంజనేయులు.