Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం '69 సంస్కార్ కాలనీ'. శ్రీ లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజరు ప్రధాన పాత్రల్లో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా నిర్మిం చారు. ఈ సినిమా ఈనెల 18న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు పి.సునీల్‌కుమార్ రెడ్డి గురువారం మీడియాతో మాట్లాడుతూ, 'నా గత చిత్రాల మాదిరిగానే ఈ సినిమా కూడా ప్రతి ప్రేక్షకుడిని ఆలోచించేలా చేస్తుంది. మానవ సంబంధాల్లో వస్తున్న మార్పుల గురించి, సమాజంలో జరుగుతున్న వింత పోకడలు గురించి చెప్పే సినిమా. ఇందులో ఒక టీనేజ్ కుర్రాడికి, ఒక పెళ్ళైన అమ్మాయికి మధ్య జరిగిన ఉద్వేగభరితమైన ప్రేమ కథ, దానికి అనుకూలించిన కారణాలు, వాటి వల్ల వచ్చిన సమస్యల గురించి చెప్పే ప్రయత్నమే ఈ సినిమా. ఇలాంటి కథలు చాలా వచ్చాయి. కానీ మేం కొత్త కోణంలో చూపించాం. ఇందులో భాగంగా కొన్ని విషయాలను ఓపెన్ గానే బలంగా చెప్పాను. అజరు భర్త పాత్ర చేశారు. ఆయన పాత్రలో చాలా షేడ్స్ ఉంటాయి. తన పాత్రకి ఆయన బాగా న్యాయం చేశారు. ఎస్తర్ కథ విని కంటెంట్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని, ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకంతో ఈ సినిమాలో నటిస్తానని చెప్పారు. ఈ సినిమా విషయంలో మా నిర్మాత బాపి రాజుగారు ఎక్కడా రాజీపడలేదు. ప్రస్తుతం నా దర్శకత్వంలో డాక్టర్ ఎల్‌ఎన్‌రావు, యక్కలి రవీంద్ర బాబు నిర్మించిన 'వెల్కమ్ టు తీహార్ కాలేజ్' చిత్రాన్ని జూలైలో విడుదల చేస్తాం. అలాగే చదలవాడ శ్రీనివాస రావు గారు నిర్మాతగా 'మా నాన్న నక్సలైట్' అనే చిత్రం చేస్తున్నాను. 1995 బ్యాక్ డ్రాప్లో సాగే తండ్రీ కొడుకుల కథ' అని తెలిపారు.