Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి, డి.వి.వి.దానయ్య కాంబినేషన్లో రూపొందిన పాన్ ఇండియా సినిమా 'ఆర్ఆర్ఆర్'. ఈనెల 25న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 'సినిమా చివర్లో 'ఎత్తర జెండా' అనే పాటను చూపించి మీ అందర్నీ సర్ప్రైజ్ చేయాలని మేం భావించాం. కాకపోతే, మా సంతోషాన్ని త్వరగా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాం. అందులో భాగంగానే 'ఆర్ఆర్ఆర్ సెలబ్రేషన్ ఆంథమ్'ని ఈనెల14న విడుదల చేస్తున్నాం. ఈ పాటతో రిలీజ్ కౌంట్‌డౌన్‌ని ప్రారంభిద్దాం' అని దర్శకుడు రాజమౌళి తెలిపారు.