Authorization
Mon Jan 19, 2015 06:51 pm
యువ హీరో ఆది సాయికుమార్ నటిస్తున్న తాజా చిత్రంలో నాయికగా దిగంగన సూర్యవంశీ ఎంపికైంది. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ ప్రొడక్షన్లో 10వ చిత్రంగా దీన్ని నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. ఫణి కష్ణ సిరికి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. ఈ చిత్రం కోసం ప్రతిభావంతులైన సాంకేతిక బందం పనిచేస్తోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'కథానుగుణంగా ఆది సాయికుమార్, దిగంగన సూర్యవంశీ జంట ప్రేక్షకుల్ని బాగా మెప్పిస్తుంది. వీరిద్దరి పాత్రలు చాలా భిన్నంగా ఉంటాయి. ఓ మంచి కంటెంట్ ఉన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మంచి క్వాలిటీతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాత కె.కె.రాధామోహన్ ఎక్కడా రాజీపడటం లేదు. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే తెలియజేయనున్నారు' అని చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, డిఓపి: సతీష్ ముత్యాల, కళ: కొలికపోగు రమేష్, ఎడిటర్: గిడుతూరి సత్య, యాక్షన్: రామకష్ణ, కొరియోగ్రఫీ: జిత్తు.