Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నటిగా అనుపమ పరమేశ్వరన్ గురించి అందరికీ తెలిసిందే. అయితే ఆమెలో గాయని కూడా ఉన్నారనే సంగతి చాలా మందికి తెలియదు. ఈ విషయాన్ని 'బటర్ఫ్లై' చిత్ర బృందం ప్రపంచానికి తెలియజేయాలనుకుంది. దీని కోసమై 'బటర్ ఫ్లై' చిత్రంలో 'ఆల్ ది లేడీస్' అంటూ సాగే పల్లవిగల పాటను అనుపమతో పాడించారు. తొలిసారిగా అనుపమ పాడిన ఈ పాటను ఆదిత్య మ్యూజిక్ యూ ట్యూబ్ ఛానెల్ ద్వారా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రిలీజ్ చేసింది. ఈ పాటకు సర్వత్రా మంచి రెస్పాన్స్ లభిస్తోంది.
జెన్ నెక్ట్స్ మూవీస్ ప్రొడక్షన్ హౌస్ తమ బ్యానర్లో రూపొందించిన తొలి చిత్రం 'మంత్ర'. ఈ చిత్రంలో ఛార్మి కౌర్ ప్రధాన పాత్ర పోషించారు. అందులో 'మాహా మాహా' అంటూ సాగే పాటను ఛార్మినే పాడారు. ఆ పాట ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు 'బటర్ ఫ్లై' కోసం అనుపమతో జెన్ నెక్ట్స్ పాట పాడించడం విశేషం. ఈ పాటకు అనంత శ్రీరామ్ సాహిత్యాన్ని అందించారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.