Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి కాంబినేషన్లో రూపొందుతున్న స్టయిలిష్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'ఏజెంట్'. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. శుక్రవారం మేకర్స్ ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ డేట్‌ని ఎనౌన్స్ చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవానికి మూడు రోజుల ముందు ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్‌గా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మేకర్స్ తెలిపారు.'దేశభక్తి నేపథ్య అంశాలతో రూపొందిన ఈ చిత్రాన్ని స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేయటం సబబుగా భావించాం. అలాగే ఆగస్ట్ 15వ తేదీ సోమవారం కావడంతో 4 రోజుల లాండ్ వీకెండ్ కూడా కలిసి వస్తుందని ఆశిస్తున్నాం. ఈ సినిమాలో అఖిల్ మునుపెన్నడూ చూడని రీతిలో యాక్షన్-ప్యాక్డ్ రోల్లో కనిపించనున్నారు. ఇందులో సరికొత్త అఖిల్‌ని చూడ బోతున్నారు. మలయాళ స్టార్ మమ్ముట్టి కూడా ఓ శక్తివంతమైన పాత్రలో నటిస్తున్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన సాక్షి వైద్య కథానాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మా దర్శకుడు సురేందర్‌రెడ్డి తనదైన స్టయిలీష్ మేకింగ్ ప్రేక్షకుల్ని థ్రిల్ చేయబోతున్నారు' అని మేకర్స్ అన్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి వక్కంతం వంశీ కథ అందించారు.ఈ చిత్రానికి సహ నిర్మాతలు : అజరు సుంకర, పతి దీపా రెడ్డ్ణి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి, సంగీత దర్శకుడు: హిప్ హాప్ తమిళ, డిఓపీ : రసూల్ ఎల్లోర్, ఎడిటర్: నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా, ఫైట్స్: స్టన్ శివ, దర్శకత్వం : సురేందర్‌రెడ్డి.