Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అక్కినేని నాగార్జున, ప్రవీణ్ సత్తారు కాంబినేషన్లో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్టైనర్ 'ది ఘోస్ట్'. ఈ సినిమా షూటింగ్ దుబారులో ప్రారంభమైంది.
'దుబారులో లాంగ్ షెడ్యూల్ చేయ బోతున్నాం. ఈ షెడ్యూల్లో ప్రముఖ తారాగణం పాల్గొనే చాలా ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాం. అలాగే
ఈ షెడ్యూల్లో సోనాల్ చౌహాన్ కూడా జాయిన్ అయ్యారు. నాగార్జున సరసన సోనాల్ చౌహాన్ నటిస్తున్న తొలి చిత్రం ఇదే. ఇప్పటికే పలు ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు చేస్తున్న సోనాల్ ఈ హై బడ్జెట్ ఎంటర్ టైనర్లో భాగం కావడం ఆనందంగా ఉంది. ఇప్పటివరకు దుబారులో షూట్ చేయని లొకేషన్లలో చిత్రీకరిస్తున్నాం. ఫుల్ యాక్షన్ ఫ్యాక్డ్గా ఉండే ఈ సినిమాలో ఓ సరికొత్త నాగార్జునని చూడబోతున్నారు. ఓ డిఫరెంట్ కథలో, ఆసక్తికర టైటిల్‌తో ఈ చిత్రాన్ని మా దర్శకుడు ప్రవీణ్ సత్తారు అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. నాగార్జున, ప్రవీణ్ సత్తారు వంటి రేర్ క్రేజీ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని కచ్చితంగా మెస్మరైజ్ చేస్తుందనే నమ్మకంతో ఉన్నాం' అని మేకర్స్ తెలిపారు. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నారాయణ్ దాస్.కె.నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్‌రావు, శరత్ మరార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముఖేష్ జి., యాక్షన్: రాబిన్ సుబ్బు, నభా మాస్టర్, ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వెంకటేశ్వరరావు చల్లగుళ్ల.