Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విరాజ్ అశ్విన్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న చిత్రం 'జోరుగా హుషారుగా'.
శిఖర అండ్ అక్షర ఆర్ట్స్ బ్యానర్ పై నిరీశ్ తిరువీదుల నిర్మిస్తున్నారు. అను ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ ఆవిష్కరణ శనివారం రామానాయుడు స్టూడియోలో జరిగింది. ఈ చిత్రంలోని ప్రధాన పాత్ర పోషించిన సాయికుమార్ ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'బంధాలు, అనుబంధాలు, స్నేహంతోపాటు వ్యక్తి జీవనపోరాటం వంటి అంశాలు ఇందులో ఉంటాయి. మేకింగ్, విజువల్స్ బాగా కనిపిస్తాయి' అని అన్నారు. 'ఇదొక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. ప్రస్తుతం రీరికార్డింగ్ జరుగుతోంది' అని దర్శకుడు అనుప్రసాద్ చెప్పారు. నిర్మాత నిరీశ్ తిరువీదుల మాట్లాడుతూ, 'అందరి కషితో సినిమా బాగా వచ్చింది. త్వరలోనే సినిమాని విడుదల చేస్తాం' అని తెలిపారు.