Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎన్నో హుషారైన పాటల రచనతో శ్రోతల్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని సొంతం చేసుకున్న ప్రముఖ గీత రచయిత కందికొండ యాదగిరి (49) ఇకలేరు. నోటి క్యాన్సర్‌తో తీవ్రంగా పోరాటం చేసినప్పటికీ, దాని ప్రభావం వెన్నెముకపై పడటంతో ఆయన ఆరోగ్యం బాగా దెబ్బతింది. శనివారం ఆరోగ్య పరిస్థితి విషమించటంతో తుదిశ్వాస విడిచారు.
దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా తెలుగు ప్రేక్షకులను తన పాటలతో అలరించిన కందికొండ ఇకలేరని విషయాన్ని తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, సంగీత ప్రియులు, ఆయన అభిమానులు తీవ్ర ద్రిగ్భాంతిని వ్యక్తం చేశారు.
వరంగల్ జిల్లా నర్సంపేట మండలం, నాగుర్లపల్లిలో కంది కొండ జన్మించారు. ఓయూలో ఎంఏలో తెలుగు, పాలిటిక్స్‌ని పూర్తి చేశారు. 2001లో పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన 'ఇట్లు శ్రావణీ సుబ్రమణ్యం' చిత్రంలోని 'మళ్ళీకూయవే గువ్వ..' పాటతో కందికొండ గీత రచయితగా వెండితెరకు పరిచయం అయ్యారు.ఈ పాట విశేష శ్రోతకారణ పొందడంతో కందికొండకి చాలా అవకాశాలొచ్చాయి. సంగీత దర్శకుడు చక్రితో ఉన్న స్నేహం, ఆయనిచ్చిన ప్రోత్సాహంతో కందికండ తనలోని విలక్షణ సాహిత్య కోణాన్ని ప్రపంచానికి పరిచయం చేయగలిగారు. మెలోడీ పాటలకు కేరాఫ్‌గా నిలిచిన ఆయన 'ఇడియట్'లో 'చూపుల్తో గుచ్చి గుచ్చి', 'సత్యం'లో 'మధురమే మధురమే, 'పోకిరి'లో 'గలగల పారుతున్న గోదారిలా', 'జగడమే' వంటి తదితర పాటలు రచించారు. రెండున్నర దశాబ్ధాల సినీ ప్రస్థానంలో కందికొండ 1300 పాటలు రాశారు. బతుకమ్మ నేపథ్యంలో రాసిన పాటలు పల్లెపల్లెనా జనం నోట మార్మోగాయి. తొలుత నోటి క్యాన్సర్‌తో పోరాడిన ఆయన దాని ప్రభావం వల్ల వచ్చిన వెన్నెముక వ్యాధితో బాధపడ్డారు. దీనికి తోడు కరోనా రావడంతో మరింత ఇబ్బందుల పాలయ్యారు. కందికొండ ఆరోగ్య పరిస్థితిని మెరుగుపర్చేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకున్నా ఫలితం దక్కపోవడం బాధాకరం.