Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నన్ను, నా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టేందుకు కొంత మంది కుట్ర పన్నారు. ముఖ్యంగా మా ఫ్యామిలీ ఎదుగుదలను ఓర్వలేక కావాలనే అవాస్తవాలను మీడియాలో ప్రచారం చేస్తున్నారు. నా పై ఎటువంటి కేసు నమోదు కాలేదు' అని నిర్మాత బెల్లంకొండ సురేష్ అన్నారు.
బెల్లంకొండ సురేష్‌కి తాను 85 లక్షల రూపాయలను ఇచ్చానని, వాటిని తిరిగి ఇవ్వమని అడిగితే, ఇవ్వడం లేదని శరన్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడని, దీంతో బెల్లంకొండ సురేష్‌పై పోలీసులు కేసు నమోదు చేశారని మీడియాలో పలు వార్తలొచ్చాయి. దీనిపై స్పందిస్తూ నిర్మాత బెల్లంకొండ సురేష్ శనివారం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'శరన్ నాకు బాగా పరిచయం ఉన్న వ్యక్తే. మా ఇద్దరిదీ ఒకే ఊరు. అయితే తాను ఆరోపణలు చేస్తున్నట్టు నాకు 85 లక్షల రూపాయలు ఇవ్వలేదు. ఒకవేళ తాను నాకు ఇచ్చినట్టయితే ఆధారాలను పోలీసులకు ఇవ్వాలి. అలా చేయకుండా కోర్టులో ప్రైవేట్ పిటీషన్ వేశాడు. ఆధారాలు లేకుండా కోర్టులో కూడా ఏమీ జరగదనే ఇంగితం శరన్‌కి లేకపోవడం హాస్యాస్పదం. నాకు కోర్టు, సీసీఎస్ నుంచి ఎలాంటి నోటీసులు రాలేదు. పైగా నాపై నిరాధార ఆరోపణలు చేసినందుకు తనకే కోర్టు నోటీసులు పంపింది. శరన్‌తో కలిసి కొంతమంది వ్యక్తులు మా ఫ్యామిలీపై కుట్ర పన్నారు. నా కొడుకులు ఇద్దరూ హీరోలుగా, నేను నిర్మాతగా ఎదగటం చూసి ఓర్వలేక పోతున్నారు. అందుకే మా ఇమేజ్‌ని డామేజ్ చేస్తున్నారు. డబ్బులు ఇచ్చినట్టు సాక్ష్యాలు బయటకు పెట్టక పోతే శరన్పై పరువు నష్టం దావా వేస్తా. లీగల్‌గా ఎదుర్కొంటా. అలాగే ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా పోలీసులకు సహకరిస్తా' అని తెలిపారు. పలు భారీ చిత్రాల నిర్మాణంతో బెల్లంకొండ సురేష్ అగ్ర నిర్మాతగా మంచి పేరు సొంతం చేసుకున్నారు. అలాగే ఆయన పెద్ద తనయుడు బెల్లకొండ సాయిశ్రీనివాస్ హీరోగా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వి.వి.వినాయక్ దర్శకత్వంలో 'ఛత్రపతి' హిందీ రీమేక్‌లో నటిస్తున్నారు. అలాగే బెల్లంకొండ రెండో తనయుడు గణేష్ హీరోగా పరిచయం అవుతూ 'స్వాతిముత్యం' అనే చిత్రంలో నటిస్తున్నారు.