Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మే ఒకటవ తేదీన చిత్ర పరిశ్రమలోని అన్ని విభాగాల(24 క్రాప్ట్స్)తో కలిసి మేడే ఉత్సవాలు నిర్వహించేందుకు ఫిలిం ఫెడరేషన్ ప్లాన్ చేస్తుంది. దాదాపు పది వేలమందితో భారీస్థాయిలో ఈ ఉత్సవాలను జరుపనుంది. ఈ సందర్బంగా శనివారం ఫిలిం ఛాంబర్లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఫిలిం ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ కుమార్ వల్లభనేని, జనరల్ సెక్రటరీ దొరై, ట్రెజరర్ సురేష్, దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్‌తో పాటు 24 క్రాఫ్ట్స్‌కు సంబంధించిన అధ్యక్షులు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ, 'అందరికీ పండగలు ఉంటాయి. అలాగే మా సినిమా ఇండిస్టీకి కూడా ఓ పండగ ఉంది. అదే మేడే. ఆ రోజున గ్రాండ్‌గా సినిమా రంగం అంతా కలిసి మేడే ఉత్సవాలని జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవిగారు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. సినిమా రంగానికి చెందిన 24 క్రాఫ్ట్స్ కలిసి నిర్వహించే అత్యంత భారీ కార్యక్రమం ఇది' అని చెప్పారు.
'తెలుగు సినిమా పరిశ్రమ అంటే హీరోలు, ఆడియో ఫంక్షన్లు, రిలీజ్లు మాత్రమే కాదు. సినిమా పరిశ్రమ అంటే ఎంప్లాయిస్ ఫిలిం ఫెడరేషన్, దానికింద పనిచేస్తున్న 24 క్రాఫ్ట్స్, జూనియర్ ఆర్టిస్ట్, టెక్నీషియన్, లైట్ బారు.. ఇలా అందరు కలిసి పనిచేస్తేనే ఒక సినిమా వస్తుంది. దీని కింద చాలా మంది కార్మికులు ఉన్నారని చాలా మంది మరచిపోయారు. మన దగ్గర చాలా కార్మిక శక్తి ఉంది. ఈ శక్తిలో ఔన్నత్యం పెరగాలి, ఐక్యత పెరగాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే కార్మికులందరికి చాలా కష్ఠాలు ఉన్నాయి.. వాటిని ప్రభుత్వానికి చెప్పుకునేందుకు ఈ పండగ ఉపయోగపడుతుంది. ఈ వేడుకలో తాను ముఖ్య అథితిగా పాల్గొని, అందరితో కలిసి సహపంక్తి భోజనం చేస్తానని చిరంజీవిగారు మాట ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. కార్మికులకు అండగా ఉంటూ మాకు అన్ని విధాలా సహాయ సహకారాల్ని అందిస్తున్న ప్రముఖులందరినీ ఈ వేడుకలో మనస్ఫూర్తిగా సన్మానించనున్నాం. ఈ భారీ వేడుక కోసం పరిశ్రమలోని 24 క్రాప్ట్స్‌కి సంబంధించిన ప్రతి ఒక్కరూ సహకరిస్తున్నారు' అని ఫిలిం ఫెడరేషన్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ వల్లభనేని అన్నారు.