Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మేం ఊహించిన దానికంటే మా 'రాధేశ్యామ్' సినిమాకి విశేష ప్రేక్షకాదరణ లభిస్తుండటం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా చాలా బాగుందంటూ ప్రభాస్ అభిమానులతోపాటు ప్రేక్షకులు సైతం ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు' అని దర్శకుడు రాధా కృష్ణకుమార్ అన్నారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా గోపీకృష్ణా మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించిన పాన్ ఇండియా చిత్రం 'రాధేశ్యామ్'. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందు కొచ్చింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలతోపాటు ఓవర్సీస్లోనూ ఈ సినిమా మంచి ఆదరణ పొంది, అనూహ్యంగా కలెక్షన్లను రాబడుతోంది. ఈ నేపథ్యాన్ని పురస్కరించుకుని శనివారం చిత్ర దర్శకుడు రాధాకృష్ణకుమార్, సంగీత దర్శకుడు తమన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, 'ఇది రెగ్యులర్‌గా ఉండే ప్రభాస్ సినిమా కాదు. ఓ ఫ్రెష్‌నెస్‌తో ఫ్యూర్ లవ్‌స్టోరీతో తెరకెక్కిన సినిమా. అందుకే ఇందులో ఫైట్లు ఉండవు. మాస్‌ని ఎంటర్టైన్ చేసే ఎలిమెంట్స్ ఉండవు. అయితే ఫ్యామిలీతోపాటు అందరూ కలిసి ఎంజారు చేసే సినిమా ఇది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ సినిమాకి సర్వత్రా మంచి అప్లాజ్ వస్తోంది. కథని, పాత్రల భావ వ్యక్తీకరణని, సన్నివేశాల ప్రాధాన్యతలోని సోల్‌ని ప్రేక్షకుల మనసులకు మరింత రీచ్ అయ్యే విధంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఉందని అందరూ ప్రశంసిస్తున్నారు. ఓ మంచి సినిమాకి పని చేసినందుకు చాలా గర్వంగా ఫీలవుతున్నాను' అని అన్నారు. 'థియేటర్లో ఈ సినిమాని మా ఫ్యామిలీతోపాటు ఫ్రెండ్స్ కలిసి చూశాను. అందరూ చాలా బాగుందన్నారు. కొన్ని సన్నివేశాలను చూసి మా కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. కథలోని భావోద్వేగం అందరికీ రీచ్ కావడం హ్యాపీగా ఉంది. సినిమాని హిట్ చేసిన ప్రేక్షకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను' అని దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెలిపారు.