Authorization
Mon Jan 19, 2015 06:51 pm
డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్న సత్య మాస్టర్ లేటెస్ట్గా నటనలో సంపూర్ణ శిక్షణ ఇచ్చే 'సత్య ఫిల్మ్ అకాడమీ'ని ఆరంభించారు. పలువురు సినీ, రాజకీయ అతిరథుల సమక్షంలో ఆదివారం ఈ అకాడమీ ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సత్య అకాడమీ ఫౌండర్ సత్య మాస్టర్ మాట్లాడుతూ,'డాన్స్‌లో నాకు మా అన్నయ్య నాకు స్ఫూర్తి. తన సపోర్ట్‌తో గొప్ప డాన్సర్ అవ్వాలనే లక్ష్యంతో విజయవాడలోని మస్తాన్ మాస్టర్ దగ్గర డాన్స్ నేర్చుకున్నాను అక్కడే నేను, శేఖర్ మాస్టర్ ఒకే ఇన్స్టిట్యూట్లో డాన్స్‌లో శిక్షణ పొందాం. ఇక్కడ కూడా ముక్కు రాజు, రాకేష్ మాస్టర్ దగ్గర శిష్యరికం చేశాం. ఆ తరువాత డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా చేస్తూ మా కంటూ ఓ మంచి గుర్తింపు పొందాం. ఈ క్రమంలో మేం ఈ స్థాయికి రావడానికి ఆంధ్ర యూనియన్ తెలుగు డాన్సర్స్ అసోసియేషన్ వారు, చాలా మంది మాస్టార్లు సపోర్టు చేశారు. సత్య డి.జోన్ డాన్స్ అకాడమీని నెలకొల్పి, ఎన్నో వందల మంది డాన్సర్స్‌ను తయారు చేసి, టీవీ రంగానికి, సినిమా రంగానికి పంపించినందుకు చాలా గర్వపడుతున్నాను. యాక్టింగ్ నేర్చుకోవాలనే తపన ఉన్న చాలామంది నాకు తారసపడ్డారు. వారందరికీ నటనలో సరైన ఫ్లాట్‌ఫామ్ ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ అకాడమీని ఏర్పాటు చేశాం. ఈ అకాడమీలో ఎంతోమంది నిష్ణాతులు, నంది అవార్డు గ్రహీతలు, ప్రొఫెషనల్ ప్రొఫెసర్ ద్వారా స్టూడెంట్స్‌కు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే నటనలో మంచి అవకాశాలు వచ్చేలా శిక్షణ ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం' అని తెలిపారు. ఈ అకాడమీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అతిథులందరూ సత్య మాస్టర్ సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు.