Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలకష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన 'అఖండ' చిత్రం విశేష ప్రేక్షకాదరణతో 20 థియేటర్లలో వంద రోజులు పూర్తిచేసుకుంది. డిసెంబర్ 2న విడుదలై, కరోనా సమయంలోనూ ఊహించని విజయాన్ని ఈ సినిమా సాధించింది. దిగ్విజయంగా వంద రోజులు పూర్తి చేసుకున్న నేపథ్యాన్ని పురస్కరించుకుని 'అఖండ వంద రోజుల కతజ్ఞత సభ'ను శనివారం రాత్రి కర్నూల్లోని ఎస్టి.బి.సి.కాలేజ్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బాలకష్ణ మాట్లాడుతూ, 'ఇంతమంది జనం మధ్య వందరోజుల వేడుక జరుపుకుని ఎన్ని సంవత్సరాలైందో. మేం ఈ సినిమాను ప్రారంభించి నప్పుడు 'సింహా', 'లెజెండ్'కు మించి ఉండాలని మేం అనుకోలేదు. కరోనా టైమ్‌లోనూ మా చిత్రానికి ప్రేక్షకులు, అభిమానులు అఖండ విజయాన్ని ఇచ్చారు. ఎలాంటి కథ అయినా సరే నేను బోయపాటి ఉన్నాడన్న ధైర్యంతో సినిమా చేస్తాను. నటీనటుల్లో హావభావాలు ఎలా రాబాట్టాలో ఆయనకు బాగా తెలుసు. నేను కత్రిమైన సినిమాలు 'భైరవదీపం', 'ఆదిత్య 369' చేశాను. కానీ 'అఖండ' వంటి సహజమైన సినిమా చేసి అఖండ విజయాన్ని సాధించడం ప్రేక్షకుల అభిమానమే కారణం. ఎన్ని సినిమాలొచ్చినా నా సినిమాలే నాకు పోటీ. రాబోయే సినిమాలు సైతం మిమ్మల్ని అలరిస్తాయి' అని అన్నారు.
నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, 'భారతీయ సినిమాకు దిక్సూచి లాంటి సినిమాను అందించినందుకు ప్రేక్షకులకు కతజ్ఞతలు. పాండమిక్ టైంలో మా సినిమా వంద రోజులు ఆడటం గొప్ప విషయం' అని తెలిపారు.
బాలయ్యబాబుతో 2009లో 'సింహా'తో మొదటి అడుగువేశాం. 2014లో 'లెజెండ్'తో రెండో అడుగు, 2021లో 'అఖండ'తో మూడో అడుగు వేశాం. మాది 13 ఏండ్ల సుదీర్ఘ ప్రయాణం. మా ప్రతి సినిమా ప్రయోగమే. అభిమానులే మా సినిమాలను ఆదరించి, అద్భుతమైన విజయాలుగా మలిచారు. బాలయ్యగారి బలం మీరే. చరిత్ర సష్టించాలన్నా,
దాన్ని తిరగరాయాలన్నా మీరే. ఇంతటి అభిమానాన్ని సంపాదించుకున్న బాలయ్యబాబు గొప్ప వ్యక్తి. మా జర్నీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నా
- దర్శకుడు బోయపాటి శ్రీను